India crosses 33000 Covid-19 cases దేశంలో 33000 వేల మార్కు దాటిన కరోనా కేసులు..

Coronavirus update covid 19 cases in india cross 33 000 state wise status

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

As the country gears up for a staggered withdrawal of the 40-day lockdown from May 4, the total number of coronavirus patients in India has gone up to 33,050 while the death toll has reached 1,074, showed latest figures from the Health Ministry. In the past 24 hours, the total number of Covid-19 cases has gone up by 1,718 while 67 deaths were reported.

దేశంలో 33000 మార్కు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 67 మరణాలు

Posted: 04/30/2020 09:51 AM IST
Coronavirus update covid 19 cases in india cross 33 000 state wise status

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో అత్యధికంగా 1718 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 67 మరణాలు సంభవించడంతో పాటు ఏకంగా దేశంలో వెయ్యి సంఖ్య దాటి మరణాలు నమోదుకావడం అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1718 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల 33 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 33 వేల 050 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య కూడా వెయ్యి మార్కు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 67 మందిని పోట్టన బెట్టుకుంది. దీంతో మరణాల సంఖ్య కూడా 1074కు చేరింది. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 8324 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 23, 651గా నమోదైంది.  గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 31 మంది, గుజరాత్ లో 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా మరో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉండటం ఊరటకలిగిస్తోంది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ ఒక్క రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పది వేల మార్కు చేరువలో వున్నాయి, ఇప్పటివరకు 9915 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య కూడా 432 మార్కు దాటింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 32 మరణాలతోపాటు 597 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య పది వేల మార్కుకు చేరువలో కొనసాగుతుంది, ఏకంగా రాష్ట్రంలో 9915 మంది కోవిడ్ బారిన పడగా 432 మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువుతున్నాయి.

మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్లో చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4082కి చేరగా వీరిలో ఇప్పటివరకు 197మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 129మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3439 మందికి కరోనా సోకగా 56మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles