Curbs could be lifted in green zones: Kishan Reddy కోవిడ్-19: ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడకంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు

No relaxation of lockdown in red zones after may 3 g kishan reddy

coronavirus, Government Guidelines, Covid Lockdown, Lockdown guidelines, G Kishan Reddy, Union Minister, Lockdown, containment Zones, Red Zones, No Transport

Union Minister of State for Home Affairs G Kishan Reddy said that there will be no relaxation of lockdown after May 3 in Containment Zones and Red Zones. Speaking to media persons he said that the government had given relaxations to mitigate the problems faced by the people of the country by opening industries and business establishments in green zones.

మే 3 తరువాత కూడా అక్కడ సడలింపులు లేవ్.. సంకేతాలిచ్చిన కిషన్ రెడ్డి

Posted: 04/29/2020 06:45 PM IST
No relaxation of lockdown in red zones after may 3 g kishan reddy

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు మే 3వ తేదీ వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా తొలి విడతలో 21 రోజుల పాటు మలి విడతలో 19 రోజుల పాటు లాక్ డౌన్ కోనసాగుతోంది. ఇక మరో నాలుగు రోజుల వ్యవధిలో లాక్ డౌన్ ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తివేస్తారా.? ఎప్పుడు బహ్య ప్రపంచంలోకి వెళ్దామా అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్త,. మే 3 ఎప్పుడోస్తుందాజజ లాక్ డౌన్ గడువు ఎప్పుడు ముగుస్తుందా అనుకునేవారి ఆశలపై నీళ్లు చల్లనుంది కేంద్రం.

ఇప్పటికే మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, లాక్ డౌన్ పై నిర్ణయం తెలుపుతారని సమాచారం. అయితే మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మే 3 తరువాత కూడా కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయన్నారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు.

కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడన్నారు. కాగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని వెల్లడించారు. సడలింపులు ఉ‍న్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నారు కిషన్ రెడ్డి.

ప్రజా రవాణా సేవలపైనా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ప్రారంభించే అవకాశమే లేదన్నారు. మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైళ్లు నడవవని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలైనా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles