lockdown cannot be eased in Delhi: Kejriwal కరోనా వ్యాప్తి తగ్గకమునుపై సడలింపులు ఎందుకు?: కేజ్రీవాల్

Shops in delhi won t open yet government to first review situation

Delhi CM, Arvind Kejriwal, Shops Open, Delhi Health Minister, Satyendar Kumar Jain, Shops Open, Central Government, Home Ministry, Lockdown, coronavirus lockdown, coronavirus delhi, coronavirus cases, india, coronavirus, lockdown New Guidelines, Delhi lockdown Guidelines, Delhi News

Any decision on the Ministry of Home Affairs's directive will be taken after the Delhi government reviews the situation this afternoon, Health Minister Satyendar Kumar Jain said today. "A decision will be taken this afternoon. Delhi has 92 hotspots... entire city or district is not a containment zone.

కరోనా వ్యాప్తి తగ్గకమునుపై సడలింపులు ఎందుకు?: కేజ్రీవాల్

Posted: 04/25/2020 05:54 PM IST
Shops in delhi won t open yet government to first review situation

నివాస ప్రాంతాల్లో షాపులు తెరిచేందుకు వీలుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మాస్కులు, గ్లవ్స్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి చేయాలని షరతు విధించింది. దీంతో ఢిల్లీ ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఢిల్లీలో ఇంతవరకు షాపులు తెరుచుకోలేదు. ట్రాన్స్ పోర్టేషన్ ఇంకా పునఃప్రారంభం కాకపోవడంతో... షాపుల్లో పని చేసేవారు రాలేకపోతున్నారు. దీంతో, షాపులు తెరుచుకోలేదు.

మరోవైపు మాల్స్, హెయిర్ సెలూన్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులు, జిమ్ లు, స్మిమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులను తెరవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడే ఆంక్షలను సడలించలేమని స్పష్టం చేశారు. పరిస్థితిపై ఇంకా చర్చలు జరుపుతున్నామని... ఏ నిర్ణయం తీసుకున్నా ఏప్రిల్ 30వ తేదీ తర్వాతే అమలు చేస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపులపై  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకముందే సడలింపులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల  కేంద్ర ప్రభుత్వ తాజా మార్గనిర్దేశకాలను ఢిల్లీలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే అన్ని ప్రాంతాల్లోనూ  కొనసాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో దుకాణాలను తెరచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ నెల 27న  ప్రధానమంత్రితో జరిగే వీడియో సమావేశం తర్వాత ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఆంక్షలపై సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 2,514 మందికి వైరస్ సోకింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles