TSBIE cancels affiliation of 68 junior colleges తెలంగాణలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపు రద్దు

Telangana inter board cancels affiliation of 68 colleges running without certification

covid-19, coronavirus, lockdown, fight aginst covid-18, Lockdown, Telangana, sri chaitanya inter colleges, narayana inter colleges, inter colleges, high court, Telangana govt, Intermiediate board, Hyderabad, crimesection 144, Janata curfew, Janta curfew, Janatha, curfew, Quarantine, Isolation, Self quarantine, Total cases, Dublin patient, Dublin, Google techie, Google, Bengaluru, Bangalore, Hyderabad, Chennai

Telangana State Board of Intermediate Education (TSBIE) has cancelled the affiliations of 68 inter colleges in the Telangana state. All these institutes were running without any necessary certification required for affiliation and to maintain safety standards in the buildings.

తెలంగాణలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపు రద్దు

Posted: 04/18/2020 12:26 PM IST
Telangana inter board cancels affiliation of 68 colleges running without certification

తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు ఎట్టకేలకు గుర్తింపులేని జానియర్ కళాశాలపై కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించని జూనియర్ కాలేజీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు ఇప్పటికే పలుమార్లు ఇంటర్మీడియట్ బోర్డును ప్రశ్నించింది. ఈ క్రమంలో పలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని, గుర్తింపులు లేని 68 జూనియర్‌ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇందులో నారాయణ,  శ్రీచైతన్య కాలేజీలు ఉన్నాయి.

దీంతో రాష్ట్రంలోని పలు జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. తెలంగాణలో జూనియర్‌ కాలేజీలపై చర్యలకు ఇంటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో కార్పొరేట్‌ కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 26 నారాయణ కాలేజీలు ఉండగా... ఇక మరో కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్యవి 18 కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్ జక్షన్ సర్టిఫికేట్లను తీసుకోకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి గతంలో కార్పొరేట్‌ కాలేజీలైన శ్రీచైతన్య, నారాయణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త రాజేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గత ఫిబ్రవరి 27న విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్‌ 3లోపు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles