Major Metro cities in hotspot in India దేశంలోని మహానగరాలన్నీ హాట్ స్పాట్లే..

170 hotspots 207 potential hotspots in the country metros marked red zones

containment zones, Corona cases, Coronavirus, COVID-19, green zones, Health ministry, hotspots, Metro cities, potential hotspots, red zones, south india, virus outbreak, coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus in chennai, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

In the last 24 hours, fresh 1,076 cases of novel Coronavirus or Covid-19 have been reported in the country, taking the total number to 11,439. Maharashtra, Tamil Nadu, Andhra Pradesh along with Delhi are the worst affected. Metro cities have been marked as ‘red zones’ in Govt’s Covid-19 list.

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని మహానగరాలన్నీ హాట్ స్పాట్లే..

Posted: 04/16/2020 07:56 PM IST
170 hotspots 207 potential hotspots in the country metros marked red zones

ఇన్నాళ్లు నగరీకరణ చూసిన వాళ్లను గ్రామీణ ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుని చూసేవాళ్తు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలే చాలా సేఫ్ గా వున్నాయి. ఇక నగరాలు జాబితాలను చూస్తే అన్ని కోవిడ్-19 కేంద్రాలుగానే మారాయని చెప్పక తప్పదు. కేంద్రం తాజాగా ప్రకటించిన హాట్‌స్పాట్‌ రెడ్‌ జోన్లను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ఆరు మహా నగరాలైన ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలన్నీ కరోనా వైరస్ కేందాలుగానే మారాయి. వీటితో పాటు జైపూర్‌, ఆగ్రాలతో పాటు దేశవ్యాప్తంగా 123 జిల్లాలు కూడా ఈ రెడ్ జోన్ల పరిధి జాబితాలో చేర్చింది కేంద్రం.

దేశంలో లేదా సంబంధిత రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా కలిగి ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అంతేకాకుండా, కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తుల సంఖ్య నాలుగు రోజుల్లో రెట్టింపు అవుతుంటే ఆయా ప్రదేశాలను కూడా రెడ్ జోన్లుగానే వ్యవహరిస్తారు. ఈ రెడ్ జోన్ల పరిధిలో దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్ధిక రాజధాని ముంబై, సహా దేశంలోని మహానగరాలన్నీ అత్యధిక కొవిడ్‌-19 కేసులను నమోదు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2,916 కాగా అందులో సగానికి పైగా అంటే 1896 కేసులు ముంబయి మహానగరానికి చెందినవే.

ఇక ఢిల్లీలో 1561 పాజిటివ్‌ కేసుల్లో 30 మందికి నయంకాగా 30 మంది మరణించారు. దిల్లీ ప్రభుత్వం 56 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. వీటిలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు రద్దు చేయటంతో పాటు, ఎవరూ బయటకు వచ్చేందుకు అనుమతి ఉండదు. ఇక కేంద్రం ప్రకటించిన మొత్తం 170 హాట్‌స్పాట్‌లలో 47 ప్రాంతాలను క్లస్టర్లుగా... అంటే 15 కంటే ఎక్కువ కేసులు నమోదై, అంటువ్యాధి నిరవధికంగా విస్తరిస్తున్న ప్రాంతాలుగా ప్రకటించారు. ఆపైన హాట్‌స్పాట్లుగా మారే అవకాశమున్న మరో 207 జిల్లాల జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. ఈ బృందాలు కేవలం కరోనాకు మాత్రమే కాకుండా, ఫ్లూ వంటి ఇతర శ్వాస సంబంధిత వ్యాధుల నిర్ధారణకు కూడా పరీక్షలను నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles