Govt fresh guidelines for lockdown 2.0 లాక్ డౌన్ 2.0: కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల..

Fighting coronavirus centre issues fresh guidelines for lockdown 2 0

covid-19, coronavirus, lockdown, PM Narendra Modi, fight aginst covid-18, Amit shah, ministry of home affairs, MHA Guidelines for Lockdown, MHA, lockdown, guidelines for lockdown, guidelines, Ayush Mantralaya, ayush mantralay, ayush guidelines for covid 19, aayush mantralay guidelines, National Politics

Fresh guidelines were issued by the government on Wednesday for enforcing the second phase of the coronavirus lockdown, with the Union home ministry barring all kinds of public transport and prohibiting opening of public places during this period.

లాక్ డౌన్ 2.0: కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల..

Posted: 04/15/2020 04:28 PM IST
Fighting coronavirus centre issues fresh guidelines for lockdown 2 0

కరోనా మహమ్మారి దేశంపై పంజా విసరుతున్న నేపథ్యంలో దానిని వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 నుంచి మే 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలోని ఆసుపత్రులతో పాటు వెటర్నరీ ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, లేబొరేటరీలు, క్లినిక్ లతో పాటు అత్యవసర విభాగాలన్నీ ఎప్పటిలాగే పనిచేస్తాయి. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు నిర్మాణ భవనం దగ్గరే ఉంటే మాత్రం అక్కడ నిర్మాణాలు జరుపుకోవచ్చు.

నిత్యవసరాలు మినహా దేశంలోని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలు మూసివేసే ఉంచాలని ఆదేశించింది కేంద్రం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు వంటి వాటికి లాక్‌డౌన్ నుంచి యధాతథంగా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు మే 3 వరకు లాక్‌డౌన్‌లోనే ఉంటాయి.

రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, జాతీయ సమాచార కేంద్రాలు వంటి సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి వాటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు వంటి సేవలకు  లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ప్రకటనలో తెలిపింది.

దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. అన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం.. దానికి భారీ జరిమానా ఉంటుంది. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి ఉండరాదు. ఇక వివాహాది శుభకార్యాలయాలను నిర్వహణపై కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కలెక్టర్ నుంచి అనుమతి పోందిన వారికి మాత్రమే మినహాయింపు వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles