lockdown extension decision likely by weekend లాక్ డౌన్ ఎత్తివేతపై అఖిలపక్ష అభిప్రాయాలు.. త్వరలో ప్రధాని నిర్ణయం

Pm modi holds all party meet on covid 19 crisis to decide on lockdown extension

Coronavirus Pandemic, Coronavirus, Coronavirus lockdown, PM Modi, chief ministers, all party meet, congress, gulam nabi azas, BJP, sharad pawar, NCP, TMC, AAP, RJD, lockdown news, National, Politics

The Centre is expected to decide to extending the 21-day pan-India lockdown post April 14 after Prime Minister’s scheduled meeting with chief ministers via video conferencing this Saturday.

లాక్ డౌన్ ఎత్తివేతపై అఖిలపక్ష అభిప్రాయాలు.. త్వరలో ప్రధాని నిర్ణయం

Posted: 04/08/2020 10:39 PM IST
Pm modi holds all party meet on covid 19 crisis to decide on lockdown extension

దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌-19 వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్యనేతలతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో పలు అంశాలపై ప్రధాని వారి నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు.

వైరస్‌ కట్టడికి, లాక్‌డౌన్‌ వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కేంద్ర వైద్య, హోమ్‌, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించారని తెలిసింది. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరత గురించి నేతలు సమావేశంలో లేవనెత్తారని సమాచారం. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపేయాలని మరికొందరు పేర్కొన్నారని తెలిసింది.

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్‌-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus Pandemic  Coronavirus  lockdown  PM Modi  all party meet  congress  BJP  NCP  TMC  AAP  lockdown news  National  Politics  

Other Articles