తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 11 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో అనేక మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 63 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల 427కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ గణంకాలు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు నమోదైనవి.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ ప్రార్థనలకు హాజరై తిరిగివచ్చిన వారితో తెలంగాణలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో నిన్న 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 63 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 427కు పెరిగింది. ఇప్పటికే మరణించిన 11 మందిలో రమారమి అందరూ మర్కజ్ లింకు వున్నవారేనని సమాచారం. కాగా, మరో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వారిని డిశ్చార్జి చేశారు. పాజిటివ్ వచ్చిన రోగులందరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
తెలంగాణలోని 427 యాక్టివ్ కేసుల్లో హైదరాబాద్ నగరంలోనే బాధితులు ఎక్కువగా ఉన్నారని సమాచారం. హైదరాబాద్లో ఇప్పటికే 162 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా తాజాగా నమోదైన 63 మందిలో హైదరాబాద్ కు చెందిన వారు కూడా వున్నారు. అయితే వీరి గణంకాలను తెలియాల్సి వుంది. ఆ తర్వాత ప్లేస్‌లో వరంగల్ అర్బన్, నిజామాబాద్, నల్లగొండ, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ లు నిలిచాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more