Pawan Kalyan supports PM Modi video message ప్రధాని పిలుపుకు మద్దతునిచ్చిన జనసేన

Janasena cheif pawan kalyan supports pm modi video message

Pawan Kalyan, COVID-19, coronavirus, protective gear, doctors at high risk, paramedical workers high risk, State government, High Court, Personal Protection Equipment (PPE), coronavirus infection, high risk, Andhra pradesh, Politics

Jana Sena Party (JSP) president Pawan Kalyan insisted the State government should follow the directions of the High Court on the provision of Personal Protection Equipment (PPE) to doctors and paramedical workers who faced a high risk of coronavirus infection.

ప్రధాని పిలుపుకు మద్దతునిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Posted: 04/03/2020 06:42 PM IST
Janasena cheif pawan kalyan supports pm modi video message

కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై కదం తొక్కుతున్న ఈ సందర్భంలో దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక పురోగతి నత్తనడకన సాగుతున్నా.. దానిని పట్టించుకోకుండా.. ప్రజారోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం.. దేశవ్యాప్త లాక్ డౌన్ ను అమలు చేసింది. దీంతో వలస కూలీలు, కార్మికులు, పేద వర్గాల్లో కొంత ఇబ్బందులు తలెత్తినా.. దేశ ప్రజల భవిష్యత్తు.. అరోగ్యం కోసం ఈ చర్యలు తప్పవని నిర్ణయాలను అమలు చేసింది.

ఈ నేపథ్యంలో మార్చి 20న దేశప్రజల ముందుక వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. దీంతో పాటు సాయంత్రం ఐదు గంటలకు కరతాళధ్వనులు చేయాలని కూడా చెప్పారు. ఆ తరువాత లాక్ డౌన్ కోసం ప్రజలముందుకు వచ్చిన ప్రధాని మోదీ.. తాజాగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని దేశప్రజలను కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. ఇళ్లల్లోనే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి చీకట్లను తరిమికొట్టాలని సూచించారు. ఈ క్రమంలో 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని చాటుదామని మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ తల పెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పండితులు జ్యోతిశాస్త్ర పండితులు, దేవి ఉపాసకులు తాజగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్యోజనాలు ఏమిటన్నది కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్విటర్ ద్వారా మద్దతు తెలిపారు. మోదీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే ట్విటర్‌లో 9baje9minute (9 గంటలకు 9 నిమిషాలు) తో పాటు Lightup India అనే హ్యాష్‌ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. ఇలా ప్రధాని మూఢనమ్మకాలను నమ్ముకోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. మోదీ లైట్‌ప్ ఇండియా కాన్సెప్ట్‌లో క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం సైన్స్ దాగుందనే అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి.

ఆయుధాలు లేకుండా యుద్దానికా.?: ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాంటి వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మెడికల్‌ మాస్కులు, గౌన్స్‌, గ్లోవ్స్‌, కంటి అద్దాలు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటిని తగినవిధంగా సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. ఎన్‌-95 మాస్కులు కూడా సమకూర్చలేదని.. సాధారణ డిస్పోజబుల్‌ గౌన్స్‌ మాత్రమే ఇస్తున్నారనే వైద్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఒక్కసారైనా వైద్యుల ఆందోళనను వినాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిర్దేశించిన విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ఇస్తేనే వాళ్లు ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పీపీఈలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. తమతో పాటు తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వారి సేవలను గుర్తించాలి. వారిని ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి’ అని ఏపీ ప్రభుత్వానికి పవన్‌ విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles