PM Modi's New Video Message to People of India దేశప్రజలకు మరో పిలుపును అందించిన ప్రధాని

Pm narendra modi s new video message about coronavirus to people of india

Narendra Modi, Coronavirus, Narendra Modi news, Narendra Modi latest, Narendra Modi video, Narendra Modi message, Narendra Modi about coronavirus, Coronavirus news, Coronavirus updates, Narendra Modi New Video Message About Coronavirus, Narendra Modi, PM Modi, New Video Message, Coronavirus, LIghts, candles, Oil Lamps, electrical bulbs, Covid-19, People of India

PM Modi sent a new video message to people of India in which he asked to switch off the lights on April 5th at 9 PM for nine minutes and stand in their doorway or balconies for nine minutes with candles or torches to fight the darkness that is spread by coronavirus with light.

కరోనాపై యుద్దం: దేశప్రజలకు మరో పిలుపును అందించిన ప్రధాని

Posted: 04/03/2020 01:07 PM IST
Pm narendra modi s new video message about coronavirus to people of india

కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. ఓ వైపు వైద్యరంగంలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే.. మరో వైపు హిందూ సనాతన ధర్మాలను అనుసరించి ఈ విపత్కర పరిణామాలను ఎలా అధిగమించాలనే యోచనతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన దేశప్రజలకు మరో పిలుపునిచ్చారు. రానున్న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల 9 సెకన్ల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.

చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలాలని, ఇదే రామబాణం అని చెప్పారు. ఈ పోరాటాన్ని కొనసాగించాలని, యుద్ధంలో గెలవాలన్నారు. 130 మంది కోట్ల మంది అందరూ సంఘటితంగా ఉన్నామని చాటి చెప్పాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి కోరలు చాస్తోంది. భారతదేశాన్ని కూడా గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతకంటే ముందు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మరోసారి ప్రజలనుద్దేశించి మాట్లాడుతానని మోడీ చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ప్రతొక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనని, జనతా కర్ఫ్యూ, లాక్ డైన్ ద్వారా ప్రజలు సహకరించారని తెలిపారు. పరిస్థితులు ఎదుర్కోవడంలో సంఘటితంగా ఉండాలన్నారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

ప్రపంచదేశాలు భారతదేశం బాటలోనే పయనిస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రారదోలేందుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా పాటించాలని, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు..లైట్లు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలన్నారు. ఈ సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles