Death Rate From Coronavirus Lower Than estimated కరోనా మరణాలపై తాజా అద్యయనం.. ఏం చెప్పిందంటే..

Covid 19 death rate from coronavirus lower than previously believed

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

A new study that considers mild cases of COVID-19 that often go undiagnosed estimates the death rate from the novel coronavirus to be about 0.66% rather than the previously estimated 2%. However, COVID-19 fatality rates are close to 8% in people aged 80 or over, making infection control measures critical in assisted living and long-term care facilities.

కోవిడ్-19 మరణాలపై తాజా అద్యయనం.. ఏం చెప్పిందంటే..

Posted: 04/01/2020 05:27 PM IST
Covid 19 death rate from coronavirus lower than previously believed

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సుమారుగా 200 పైగా దేశాలపై తన ప్రభావాన్ని చాటింది. ఎక్కడో చైనాలోని వూహాన్ పట్టణంలో పుట్టుకోచ్చని ఈ మహమ్మారిని ఇప్పటివరకు దాదాపు 9లక్షల మందిని తన బారిన పడేసింది. ఇది అధికారిక సంఖ్యేకానీ.. వాస్తవ సంఖ్య మాత్రం ఇంతకు మించేవుంటుందని తెలుస్తోంది. కరోనా వైరస్ భారిపడి మరణించిన సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి.. క్రమంగా తన ప్రభావాన్ని కూడా కొల్పోతుందని తెలుస్తోంది.

కరోనా వైరస్ ప్రపంచ ప్రజానికాన్ని భయాందోళనకు గురిచేసినంతగా ప్రస్తుతం ప్రభావం చూపడం లేదని తాజగా అద్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని  తాజా సర్వేలో వెల్లడైంది. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 1600 దాటింది. మరణాల సంఖ్య కూడా 50దాటింది.  తాజా గణంకాల ప్రకారం ఇవాళ ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. ఇక తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 110 కేసులు నమోదయ్యాయి.

అయితే ఇవాళ తమిళనాడు, ఢిల్లీ సహా పలురాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో 90శాతం వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే కావడం గమనార్హం. కాగా, కరోనా వైరస్ మరణాల రేటు ఇప్పటివరకూ వేసిన అంచనాల కంటే చాలా తక్కువగా ఉంటుందని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం తెలిపింది. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడిన వారితో పాటు ఈ మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌లో రాకపోకలు సాగించిన వారిపై  బ్రిటిష్‌ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు.

చైనాలో కరోనా వైరస్‌ కేసులను సమగ్రంగా విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన, నిర్ధారణ కాని కేసులన్నింటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఈ అథ్యయనం గుర్తించింది. నిర్ధారణైన కరోనా కేసుల్లో మరణాల రేటు 1.38 శాతంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌ నిర్ధారించిన కేసుల్లో మరణాల రేటును గతంలో అధికారులు 2 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక మొత్తం కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6 శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఇది 1.38 శాతంగా వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles