Markaz Chief Urges Muslims To Defy Lockdown దేశంలో కరోనా విజృంభనకు అక్కడ కుట్ర జరిగిందా.?

Markaz chief urges muslims to defy lockdown terms coronavirus a conspiracy

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, New Delhi, Markaj, nizamuddin, religious events, coronavirus in Telangana, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Markaz chief urges Muslims to defy lockdown.. "Can any doctors save you from this disease which has claimed 70,000 lives and turned them into angels? If Allah says that 70000 angels have been taken in his care then how can any power in the world do anything against this? This is not the time to spread fear or untouchability. This is not the time to listen to doctors and forego prayers. meeting each other. To remove this situation bring out all the women, children, animals. Remember, none of us can counter Allah’s will or nature," says the voice.

ITEMVIDEOS: కరోనా నియంత్రణ అదేశాలు పాటించవద్దని మర్కజ్ మసీదులో ఉద్బోధ..

Posted: 04/01/2020 10:21 AM IST
Markaz chief urges muslims to defy lockdown terms coronavirus a conspiracy

ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతూ వేలాది మందిని పోట్టనబెట్టుకున్న కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వగానే అలర్ట్ అయిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు.. ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించి.. యావత్ దేశ ప్రజలను క్వారంటైన్ లో వుండమని చెప్పినా.. కొందరు ప్రభుత్వ అదేశాలను తుంగలో తొక్కి.. బయట తిరుగుతున్నారని ప్రభుత్వ ఇప్పటికే పలు రాష్ట్రాల్లతో పాటు పలు నగరాల్లో కూడా కేంద్రబలగాలను రంగంలోకి దింపింది. అయినా దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వస్తున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆద్వర్యంలో నిర్వహించిన ప్రార్థనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మౌలానా సాద్.. లాక్ డౌన్ ఉత్తర్వులను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలను ముస్లింలు పాటించాల్సిన అవసరం లేదని.. వాటని అధిగమించాలన్న  అడియో టేపులు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ‘‘70 వేల మందిని బలిగొన్న ఈ వ్యాధి నుంచి మనల్ని ఏ డాక్టరైనా కాపాడగలరా? చనిపోయిన వారందరినీ తాను చూసుకునేందుకే తీసుకెళ్లానని అల్లా చెబితే... ఈ ప్రపంచంలో మరే ఇతర శక్తి అయినా దీన్ని అడ్డుకోగలదా? భయాలను, అంటరానితనాన్ని వ్యాపింపజేసే సమయం ఇది కాదు. డాక్టర్లు చెప్పే మాటలను వినకండీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులను చులకన చేశారు.

అంతేకాదు ‘‘ మీరంతా మీ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను, జంతువులను తీసుకుని బయటకు రండి. గుర్తుంచుకోండి... అల్లా ఏదైనా తలిస్తే, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు" అంటూ న్యూఢిల్లీలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ప్రసంగిస్తున్నదిగా భావిస్తున్న  ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపింది. కాగా, ఈ ఆడియోలోని వాయిస్  సాంకేతికంగా  ధృవీకరించబడలేదు. అయితే ఈ ఆడియో టేప్ ను ఓ జాతీయ మీడియా ప్రసారం చేసింది. ఈమేరకు ప్రసారం చేసిన కథనం లో.. ‘‘ముస్లింలంతా లాక్ డౌన్ ను పాటించరాదని, కొవిడ్-19ను తరిమికొట్టాలంటే సామూహిక ప్రార్థనలు చేయాలని’’ సాద్ సూచించారని కథనం పేర్కోంది.

దీంతో పాటు ముస్లింలను విడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాలని మర్కజ్ చీఫ్ సాద్ పిలుపునిచ్చారని కూడా పేర్కోంది. "మనమంతా కలిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెబితే, మీరు నమ్ముతున్నారా? అందరూ కలిసి అల్లా ప్రవచనాలను వ్యాపింపజేయాల్సిన సమయం ఇదే. ముస్లింలంతా ఒక చోట చేరడాన్ని తట్టుకోలేని వారి కుట్రే ఇది. ఇస్లాంను, ముస్లింలను, వారి మార్గాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని ముస్లింలు నమ్మితే, మనలోని సోదరభావం చచ్చిపోతుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దని, ఒకే ప్లేటులో తినవద్దని చెబుతున్నారని కూడా సాద్ ముస్లింలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

దీంతో పాటు ‘‘ముస్లింలలోని ఐక్యతను దెబ్బతీసే కుట్రే ఇదని అర్థం కావడం లేదా?" అని ఆయన ఆవేశంగా ప్రసంగించినట్టు ఆడియోలో స్పష్టమవుతోంది. ఇక ఈ ఆడియో టేప్ వైరల్ కావడంతో, అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే సాద్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మర్కజ్ కు వచ్చిన వారి వివరాలు ఇవ్వడంలో ఆయన విఫలం అయ్యారన్న కోణంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును ఆయనపై నమోదు చేయనున్నారని తెలుస్తోంది. కరోనా లాంటి మహమ్మారిపై యావత్ ప్రపంచ ఐక్యంగా యుద్దం చేస్తున్న తరుణంలో.. ఇలాంటి విద్వేషపూరిత, రెచ్చగోట్టే వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టే అవుతుందన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles