Covid-19 count crosses 1170-mark దేశవ్యాప్తంగా 1170 కరోనా పాజిటివ్ కేసులు, 30 మరణాలు

Coronavirus in india confirmed cases above 1170 death toll raises to 30

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Italy, Spain, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus n chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of Covid-19 cases stands at 1,171 at 10 am on Monday, while 98 people have been either cured or discharged and another death in West Bengal, taking the death toll to 31.

కరోనా మరణమృదంగం: దేశంలో 1170 మందికి కరోనా పాజిటివ్.. 30 మరణాలు

Posted: 03/30/2020 10:39 AM IST
Coronavirus in india confirmed cases above 1170 death toll raises to 30

యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రారంభంలో మన దేశంలో గణనీయంగా అత్యత తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా అధిక సంఖ్యలో పెరగడం తీవ్ర అందోళన రేకెత్తించే అంశం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 100పైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేవలం ఇవాళ ఉదయం నుంచి 10 గంటల వరకు 11 కేసులు నమోదవ్వడంపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందోళన వ్యక్తం చేస్తోంది.  

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ లాక్ డౌన్ చేసి ప్రజారోగ్యం దృష్ట్యా ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1170కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 30 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ తో మహారాష్ట్ర అత్యంత అధికంగా ప్రభావితం అవుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ వైరస్ బాదిన పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఐదరు మరణాలను నమోదు చేసుకున్న గుజరాత్ ప్రభావితమైంది.

ఈ రెండు రాష్ట్రాల తరువాత కర్ణాటక మూడు మరణాలను నమోదు చేయగా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, జమ్మైకాశ్మీర్ రాష్ట్రాలలో రెండేసి నమరణాలు నమోదయ్యాయి. ఇక కేరళ, తెలంగాణ, తమిళనాడు, బిహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైంది. దీనికి తోడు మహారాష్ట్ర ఆ తరువాత కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు అత్యధికంగా కరోనా వైరస్ ను బారినపడ్డారు. మహారాష్ట్రంలో 215 మంది, కేరళలో 202 మంది ఈ వైరస్ బారినపడగా, కేరళలో 83, తెలంగాణలో 79 కేసులు నమోదయ్యాయి.  ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలలో 72 మంది, గుజరాత్ లో 69  మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  COVID-19 news  Coronavirus news  coronavirus hit countries  Italy  Europe  Spain  India  

Other Articles