AP Govt passes students without annual exams కరోనావైరస్: విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఖుషీ కబర్

Coronavirus ap govt passes 6th class 9th class students without annual exams

state lock down, center warnings, state on strict action, vehicles sieze, violaters, India, Crime, coronavirus in Andhra Pradesh, covid-19 in Andhra Pradesh, coronavirus andhra pradeesh, covid-19 andhra pradesh, coronavirus, covid-19, corona spread, state lock down, cm ys jagan,Free Ration,white ration card holders, Andhra pradesh, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india

Andhra Pradesh government has decided to declare the students who are studying in the 6th class to 9th class as pass in the wake of lockdown announced by it to prevent the spread of deadly corona virus.

కరోనావైరస్: విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఖుషీ కబర్

Posted: 03/26/2020 05:44 PM IST
Coronavirus ap govt passes 6th class 9th class students without annual exams

ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కొరుతూ లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వేసవిలో ఇళ్లకు పరిమితమైన విద్యార్థులు ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఆ నిర్ణయం ఏంటనీ అంటున్నారు కదూ..  సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే.. పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష  నిర్వహించారు. కరోనా వైరస్‌ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనం, తదితర విషయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

వైరస్‌ కారణంగా స్కూళ్లు మూతపడినందున పిల్లలకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందచేయాలని, వాలంటీర్ల సహాయంతో దీనిని అందచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన విషయంలో ఒకే క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని, సీఎం గోరుముద్ద కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles