Coronavirus: All All domestic flights suspended కేంద్రం కీలక నిర్ణయం: దేశీయ విమానయానం కూడా బంద్..

Coronavirus update all domestic flights suspended from wednesday

covid-19, coronavirus, Coronavirus update, domestic flights suspended, domestic air travel, commercial airlines, domestic commercial airlines, cargo flights, restriction on domestic air travel, politics

In view of the coronavirus outbreak, the Indian government has decided to suspend all domestic air travel from Wednesday. However the restrictions shall not apply to cargo flights. "Operations of domestic scheduled commercial airlines shall cease with effect from midnight on March 24.

కేంద్రం కీలక నిర్ణయం: దేశీయ విమానయానం కూడా బంద్..

Posted: 03/23/2020 09:35 PM IST
Coronavirus update all domestic flights suspended from wednesday

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇటు భారత్ దేశంలోనూ స్టేట్ 2కు చేరుకున్న తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని పలు జిల్లాలను లాక్ డౌన్ చేసింది. అయితే తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరో అడుగు ముందుకేసీ యావత్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. రాత్రి ఏడు గంల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరు బయట కనిపించడానికి వీలు లేదని, ఇక ఈ సమయాల్లో మందుల దుకాణాలు, ఆసుపత్రులు తప్ప మరేమీ తెరచివుండరాదని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.

ఇక ఉదయం వేళ్లల్లోనూ కారులో అయితే ఇద్దరు.. బైక్ పై అయితే ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని అదేశించిన పోలీసులు అది కూడా అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అసలు ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. తమ అదేశాలను ఉల్లంఘించిన వారికి ఆరు మాసాల జైలు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. సోమవారం రోజున ప్రజలు అప్రమత్తంగా వున్నా కొందరు మాత్రం తమకేం పట్టనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే ప్రజారవాణా వ్యవస్థలైన రైళ్లు, బస్సులు పూర్తిగా స్థంభింపజేసిన అధికారులు తాజాగా విదేశాల నుంచి వచ్చి దేశీయంగా ప్రయాణాలు చేసి తమ స్వస్థలాలకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు చేరుకుంటున్నారని తెలుసుకుని.. వారిపై నిఘా వేస్తున్నారు. అయినా అధికారుల కళ్లు గప్పి కరోనావైరస్ వ్యాధిగ్రస్తులు యధేశ్ఛగా స్వస్థలాలకు వెళ్లడంతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయగా, ఇప్పుడా జాబితాలో దేశీయ విమాన సర్వీసులు కూడా చేరాయి. దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నిశ్చయించారు. తద్వారా దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి. అయితే, రవాణా విమానాలకు ఈ నిర్ణయం వర్తించదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles