India's 8th Coronavirus Fatality in Mumbai దేశంలో 8వ కరోనా మరణం.. ముంబైలో నమోదు

Coronavirus patients in india rise to 415 india s 8th coronavirus fatality

coronavirus in india, coronavirus, covid-19, corona positive case, covid-19 positive case, Indonesia, Telangana Health Ministry, Scotland, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

A 68-year-old man from Philippines, who tested positive for coronavirus infection and later recovered, has died at a hospital in Mumbai, the city civic body said on Monday, taking the death toll in India to eight. The total number of confirmed cases in the country stands at 415.

దేశంలో 8వ కరోనా మరణం.. 415కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

Posted: 03/23/2020 10:33 AM IST
Coronavirus patients in india rise to 415 india s 8th coronavirus fatality

ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్ భారత దేశంలోనూ తీవ్ర భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై తోపాటు మహరాష్ట్రలో అధ్యధిక కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కరోనా స్టేట్ 3లో వుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వర్గాల సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ మహారాష్ట్రాలో అత్యధికంగా 74 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలవరానికి గురిచేస్తోంది. ఇక మన దేశంలోనూ మృతుల సంఖ్య పెరగడం అందోళన కలిగిస్తోంది.  

తాజాగా భారత్లో కరోనావైరస్ తో చనిపోయిన మృతుల సంఖ్య 8కి చేరుకుంది. కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదుకాగా.. ఇవాళ కరోనా మరణంతో మహారాష్ట్రాలో కరోనా మృతుల సంఖ్య 3కు చేరుకుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 144సెక్షన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇవాళ చనిపోయిన వ్యక్తి 65ఏళ్ల వ్యక్తిగా చెబుతున్నారు. అతను ఫిలిప్పైన్స్‌ వ్యక్తిగా వెల్లడించారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా స్టేజ్‌3 దిశగా పయనిస్తోంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందది. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని ప్రభుత్వం కోరుతుంది. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు. ఇదిలావుండగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసి.. బయట కనిపించే వారిని లోపల వెయ్యాలని కేంద్రం రాష్ట్రాలకు అదేశాలు జారీ చేసింది.

ఇందుకు కారణం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఒక్క రోజు వ్యవధిలోనే పెరిగి 257 కేసుల నుంచి 415కు చేరుకోవడం. శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉపద్రవాన్ని తీసుకువస్తుందో ఇటలీ దేశం ఉదాహరణగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా తాజా గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులు 415 కాగా, అందులో 41 మంది విదేశీయులే వున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడి 24 మంది కోలుకున్నారు. ఈ వైరస్ వల్ల అత్యధికంగా మహారాష్ట్ర లో 89 కేసులు నమోదు కాగా, ఆ తరువాత కేరళ రాష్ట్రం 67 కేసులను నమోదు చసింది. వీటి తరువాత దేశ రాజధాని ఢిల్లీలో 30 కేసులు, ఉత్తర్ ప్రదేశ్ లో 28 కేసులు నమోదు కాగా ఆ వెంట తెలంగాణలో 26 కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles