spread of corona to telanganite from foreign returned తెలంగాణ వ్యక్తికి సోకిన కరోనా.. ముద్రను చూసి పోలీసులకు..

Coronavirus suspect skip quarantine was held in hyderabad while travelling by bus

corornavirus, covid -19, west godavari, private bus, LB Nagar, quarantine, Telanganite, foreign returned, coronavirus in india, corona positive case, covid-19 positive case, Indonesia, Telangana Health Ministry, Scotland, Hyderabad, Telangana, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

A coronavirus suspect skip quarantine and was running homr in a private bus, the co passengers suspected him with a stamp in his hand and informed police who took him in a special ambulence. Meanwhile the coronavirus had spread to the localite of telangana from foreign returned.

తెలంగాణ వ్యక్తికి సోకిన కరోనా.. ముద్రను చూసి పోలీసులకు..

Posted: 03/21/2020 10:14 AM IST
Coronavirus suspect skip quarantine was held in hyderabad while travelling by bus

విదేశాలాకు చెందినవారికే తప్ప ఇప్పటి వరకు తెలంగాణలో వుండే స్థానికుల దరి చేరని కరోనా వ్యాధి.. తొలిసారిగా తెలంగాణలో నివసించే వ్యక్తికి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రమే పాజిటివ్ ఫలితాలు కనిపించడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజానికం.. తొలిసారిగా రాష్ట్రంలో వ్యక్తికి కూడా సోకింది. దీంతో స్థానికులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. రెండో దశ ఎప్పుడో చేరామన్న వార్తలతో అందోళనకు గురవుతున్న ప్రజలు, ఈ పరిణామాలతో రెండో దశ దాటామా.? లేక చేరుకున్నామా.? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడి ద్వారా సదరు వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్టు గుర్తించారు. రాష్ట్రంలో ఈ తరహాలో ఇదే మొదటి కేసు. దుబాయ్ నుంచి ఓ వ్యక్తి ఈ నెల 14న నగరానికి రాగా కరోనా లక్షణాల కారణంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి కరోనా సోకినట్టు ఈ నెల 19న ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి తాజాగా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దాంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరినట్టయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.

ఇదిలావుండగా, క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో జరిగిందీ ఘటన. దుబాయ్ నుంచి ముంబై వచ్చిన యువకుడిని అక్కడి అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది బిజీగా వున్న సమయంలో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు ఏకంగా హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే రైలులో వచ్చాడా లేక అక్కడి నుంచి ప్రైవేటు బస్సులో వచ్చాడా.? అన్న విషయం అధికారులు తెలుసుకునే పనిలో వున్నారు.

హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరిలోని సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. బస్సులో టికెట్ కొనుక్కుని ఎంచక్కా ఎక్కేశాడు. అయితే అతడ్ని క్వారంటైన్ చేసిన సమయంలో అధికారులు అతిని చేతిపై ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా తీయడంతో కంగారు పడిపోయాడు. అనుమానించిన ప్రయాణికులు అతడిని వెంటనే బస్సు నుంచి కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corornavirus  covid -19  west godavari  private bus  LB Nagar  quarantine  Telanganite  foreign returned  

Other Articles