Hyderabad: Temples no exception to coronavirus చిల్కూర్ వీసా బాలాజీ ఆలయం మూసివేత..

Coronavirus alert hyderabad chilkur s visa balaji temple shuts down

coronavirus in india, coronavirus, covid-19, corona spread, shiridi, yadadri, badrachalam, dharmapuri, vemulavada, chilukuru balaji, tirumala, indrakeeladri, devotees, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

In the wake of a spike in Covid-19 cases in India, Chilkur Balaji Temple, which is popular as 'Visa Balaji', announced it was shutting down temple for a week till March 25 as a precautionary measure. This is the first in Telangana to shut down to contain the possible spread of the virus

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలపై కరోనా ప్రభావం.. ఆలయాల మూసివేత

Posted: 03/19/2020 11:59 AM IST
Coronavirus alert hyderabad chilkur s visa balaji temple shuts down

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో అనేక దేశాలు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. అదేస్థాయిలో ఇటు భారత ప్రభుత్వం కూడా వ్యాధి ప్రబలకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జనసాంధ్రత ఉన్న ప్రాంతాలల్లో 144 సెక్షన్ సహా అప్రకటిత కర్ప్యూ వాతావరణాన్ని తీసుకురావడంతో దేశంలో ఈ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే తరుణంలో జనసాంధ్రత అధికంగా వుండే ఫుణ్యక్షేత్రాలలోనూ ఆంక్షలను విధిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలోనూ టీటీడీ పాలకమండలి పలు ఆంక్షలను అములచేస్తోంది.

కరోనావైరస్ భయంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఇదే సమయంలో ఎక్కడా వేచి చూడకుండా స్వామి దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్లను కేటాయించి మరీ పంపుతుండగా, క్యూలైన్లలో సైతం ఒకరిని ఒకరు తాకకుండా వెళుతున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో, మహా లఘుదర్శనం స్థానంలో, లఘు దర్శనాన్ని ఆలయంలో అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతితో పాటుగా నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీకాళాహస్తి, కాణిపాకం దేవాలయాలు భక్తులు లేక వెలవెల బోతున్నాయి. కొద్ది మంది భక్తలు మాత్రమే వస్తున్నారు.

అన్నదానం, రాహుకేతులు పూజలు చేయించుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు ఆలయ అధికారులు. శని, ఆది, సోమవారాల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి సీన్ కనిపించడం లేదు. వచ్చిన కొద్దిమంది భక్తులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి వస్తున్నారు. ఇక ఇటు తెలంగాణలాలోనూ దైవదర్శనంపై కూడా కరోనా ప్రభావం పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే.. భక్తులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో రద్దీ తగ్గిపోయింది. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి, వేములవాడ రాజన, కొండగట్టు, సహా అన్ని ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది.

తెలంగాణలో వీసా దేవుడిగా ఖ్యాతిగడించిన చిలుకూరు బాలాజీ స్వామి ఆలయాన్ని ఇవాళ్టి నుంచి ఆలయ అధికారులు మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు భద్రాచలం, బాసర, ధర్మపురి, ఇతర ఆలయాలు బోసిపోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని అధికారులే స్వయంగా సూచనలిస్తున్నారు. ఇదివరకే మహారాష్ట్రలోని పలు దేవాలయాలను అక్కడి అధికారులు మూనివేశారు. షిరిడీలోని సాయిబాబా ఆలయం కూడా ట్రస్టు సభ్యులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అటు అన్నవరంలోనూ రమాసహిత సత్యనారాయణ స్వామి సామూహిక వత్రాలను అధికారులు నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles