ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పై ఎలాంటి ప్రచారం చేయకూడదని ఇటు ప్రభుత్వాలు, అటు పోలీసులు హెచ్చరిస్తున్నా.. రోజురోజుకూ పలు సత్యాసత్య ప్రచారాలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూనే వున్నాయి. దీంతో పాటు పలువురు ఈ సూచనలను తీసుకుంటే కరోనా రాదని, ఈ యోగాసనాలు చేస్తే వ్యాధి బారిన పడకుండా వుండవచ్చని సూచనలు ఇస్తూనే వున్నారు. ప్రస్తుతం ఇలాంటిదే ఓ వార్త దేశంలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే దేశానికి కాలసర్ప దోషం పట్టిందని, దీంతో ఆ తొమ్మిది రోజులు అత్యంత కీలకమని కూడా హెచ్చరికలు వస్తున్నాయి.
ఈ వార్తను హేతువాదులు తోసిపుచ్చుతున్నా.. దేశంలో మెజారిటీగా వున్న హిందువులు మాత్రం జ్యోతిష్య విశాసాలపై నమ్మకాలు కలిగినవారు కావడంతో ఈ వార్తను అంత తేలిగ్గా కొట్టిపారేలేమని, ఇది కూడా నిజం కావచ్చును కదా అని వాదిస్తున్నారు. ఇంతకీ ఆ తొమ్మిది రోజులు ఏంటీ అంటే.. వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల రెండో తేదీ నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంటుందన్న వార్త ప్రస్తుతం అలజడి సృష్టిస్తోంది. ఈ మేరకు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. పాప గ్రహాల శక్తి పుంజుకోవడంతో పాటు రాహువు దృష్టి గ్రహాల మీద పడిందని ఆయన తెలిపారు.
ఈ తరుణంలోనే పాపగ్రహాల శక్తి కారణంగా దేశంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 23వ వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని తెలిపారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో స్వాత్మానందేంద్ర ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గణపతి పూజతో దీన్ని ప్రారంభించారు. ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజల పాటు కొనసాగనున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశుపత సహిత, విషజ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని స్వాత్మానందేంద్ర తెలిపారు. సామాజిక స్పృహతో వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు. శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీదప్రభావం ఉందన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని చెప్పారు. అందుకే విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది పాల్గొంటున్నారని చెప్పారు. అయితే ప్రపంచంలోని 167 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయని.. హేతువాదులు మరో వాదనకు తెరతీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more