#Disha crime repeats; 30 year old raped and murdered రంగారెడ్డి జిల్లాలో మరో ‘దిశ’ ఘటన..

Disha crime repeats 30 year old raped and murdered

CM KCR, Disha, vetarinary doctor, Disha Rape and Murder, Thangadapalli, DSP Ravindra Reddy, CCTV footage, Chevella, Rangareddy, Telangana Police Telangana, Politics

Three months after the sensational Disha episode, yet another crime took place in the similar manner. Going into details a 30 year old woman was lying lifeless near a bridge at Thangadapalli of Chevvella mandal, Rangareddy district.

రంగారెడ్డి జిల్లాలో ‘దిశ’ ఘటన పునారావృతం

Posted: 03/17/2020 12:48 PM IST
Disha crime repeats 30 year old raped and murdered

దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన దిశ హత్యాచార ఘటన నమోదు చేసుకున్న రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటనే మరోకటి నమోదు కావడం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ‘దిశ‌` హ‌త్య‌కేసులో అమె తండ్రి అర్థరాత్రి సమయంలోనే పోలీసులకు పిర్యాదు చేయడం.. ఉదయానికి అమె మృతదేహం లభ్యం కావడం.. టోల్ గేటు వద్ద వున్న సీసీటీవీ ఫూటేజీలు నిందితుల ఫూటేజీని బట్టబయలు చేయడంతో లారీ నెంబరు ఆధారంగా కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం వెళ్లగా వారు తప్పించుకునేందుకు యత్నించడంతో వారిని ఎన్ కౌంటర్లో కాల్చివేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ దారుణ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. ఆదే జిల్లాలో మరో దిశ ఘటన నమోదు కావడం కలకలం రేపుతోంది. ఎన్ కౌంటర్లతో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే దడ పుట్టాల్సిన తరుణంలో.. అదే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో మరో దారుణం చోటు చేసుకోవడం పోలీసులకు సవాల్ విసిరేలావుంది. ఈ ఘటనలో కూడా మహిళను ఎక్కడో అత్యాచారం చేసి హత్యచేసిన తరువా ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 23 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సులో వుండే ఓ మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామశివారులో వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం వుందన్న స్థానికుల సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు గానీ ఘటనాస్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.  

20 నుంచి 30 సంత్సరాల వయస్సు ఉన్న మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, వివస్రను చేసి తీసుకొచ్చిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చి పరారు అయినట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని ఘటన ఏవిధంగా జరిగిందని  పరిశీలిస్తున్నారు. చేవెళ్ల డీఎస్పీ రవీందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles