BJP and Jana Sena will fight local bodies: pawan kalyan స్థానిక సంస్థల ఎన్నికల్లో పోత్తుపై చర్చించాం: పవన్ కల్యాణ్

Pawan kalyan slams ycp party rowdism politics at bjp and jsp vision document

Janasena, BJP, Pawan Kalyan, JanaSena, BJP, Nadendla Manohar, local body elections, Kanna Laxminarayana, Sunil Deodhara, D.Purandeshwari, PM Narendra Modi, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

Janasena Party Founder President and Telugu film star Pawan Kalyan slams Andhra Pradesh Ruling YCP party rowdism politics and said the two day incidents in the state are the best examples of criminalisation of politics by a criminal nature person as head of the pary and CM of the state at BJP and JSP Vision Document

నామినేషన్ల పర్వంలో.. దౌర్జన్యకాండలు.. ఏదీ ప్రజాస్వామ్యం: పవన్ కల్యాణ్

Posted: 03/12/2020 04:53 PM IST
Pawan kalyan slams ycp party rowdism politics at bjp and jsp vision document

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో అధికార పార్టీ దౌర్జన్యం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అభ్యర్థులు తట్టుకుని బలంగా నిలబడాలని ధైర్యం చెప్పారు. ఒక నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపడితే ఎలా వుంటుందో అందరికీ ఇప్పుడు అవగతం అవతుందని అన్నారు. నేరపూరిత రాజకీయాలకు అస్కారం లేకుండా స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే బీజేపి-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.

స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపి-జనసేన ఉమ్మడిగా రూపొందించిన ‘విజన్‌ డాక్యుమెంట్‌’ని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత పవన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేయలేని విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వున్న ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం వుందా.? అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలు అనగానే ప్రజలు భయానికి గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని పవన్‌ ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్‌ చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కఠినంగా వ్యవహరించాని కోరిన ఆయన.. పలు చోట్ల పోలీసులు కూడా అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరించారని అరోపించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు, పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. భయపెట్టి సాధించిన గెలుపు ఎన్నటికీ నిలబడదని పవన్‌ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని బీజేపి రాష్ట్ర పరిశీలకులు సునీల్‌ దేవధర్‌ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు కాదు.. ఎంపికలు జరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ ఎన్నికలు జరపకుండా జన్మభూమి కమిటీల పేరుతో మోసం చేస్తే.. వైసీపీ ఎన్నికలను ఏకపక్షంగా జరిపించడానికి అరాచకమార్గాలను అన్వేషిస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులు పోవాలంటే బీజేపీ-జనసేన కూటమి బలపడాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ నాగరాజు అయితే వైసీపీ సర్పరాజు అని.. ఈ రెండు పార్టీలు ప్రజలపై విషాన్ని చిమ్ముతున్నాయని దేవధర్‌ ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతల దాడులకు సంబంధించి పోలీసులు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం వుండడం లేదని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్జన్యకరమైన వాతావరణం నెలకొందని.. పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్‌ ఫారాలు లాక్కుని వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని కన్నా విమర్శించారు. సవాళ్లను దాటుకుని నామినేషన్లు వేసినా పరిశీలనలో కూడా తిరస్కరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత అరాచకం, దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసులు, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles