Robbery In Manappuram Gold Loan Office బంగారం కంపెనీకి గురిపెట్టిన చోరులు.. భగ్నం చేసిన పోలీసులు

Police foil robbery in kompally manappuram gold loan office

Manappuram Gold Loan company. Kompally Manappuram company, Manappuram finance Medchal district. Unidentified robbers, CCTV, vigilence team, Cyberabad Police, suspected Uttar Pradesh gang, Crime

Cyberabad Police had foiled the theft planned by notorious Uttar Pradesh gang at Manappuram Gold Loan company at Kompally of Medchal district. Unidentified robbers barged into Manappuram Gold Loan Finance Company’s building in Kompally of Medchal disrict in midnight, while attempting to cut the wires of CCTV.. the vigilence team alerted the police who foiled the theft.

బంగారం కంపెనీకి గురిపెట్టిన చోరులు.. భగ్నం చేసిన పోలీసులు

Posted: 03/12/2020 03:05 PM IST
Police foil robbery in kompally manappuram gold loan office

దొంగతనాలు చేయడానికి దొంగలు వేస్తున్న ప్లాన్స్ చూసి షాపుల యజమానులు బెంబేలెత్తుతున్నారు. తాము టార్గెట్ చేసిన దుకాణాల్లో చోరీలకు పాల్పడేందుకు వెరెవర్నో కూడా బలిచేసేందుకు సిద్దమవుతున్నారు. వ్యక్తిగత సమాచారం ఇలా కూడా అభద్రతకు గురవుతుందని తెలిసి సామాన్యులు ఖంగుతింటున్నారు. మారు పేర్లు, తప్పుడు ఆధార్ కార్డులు, తప్పుడు విద్యుత్ బిల్లులతో ఫేక్ ఆదారాలు షెటర్లను అద్దెకు తీసుకుని ఆ తరువాత అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాలుగా మార్చుతున్నారు. పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ మాటాలు మరోమారు మేడ్చల్ జిల్లావాసుల చెవుల్లో ప్రతిధ్వనించాయి.

తాజాగా పేట్ బషీరాబాద్‌ మణప్పురం గోల్డ్ లోన్స్ కార్యాలయంలో చోరీకి కొందరు దొంగలు విఫలయత్నం చేశారు. కొంపల్లిలోని సన్న మల్లేశం యాదవ్‌ కాంప్లెక్స్‌ మొదటి అంతస్తులో మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్ ఉంది. దానిని ముగ్గురు యువకులు టార్గెట్ చేశారు. దానిలోని బంగారంతో ఉడాయించి.. తమ జల్సాలన్నీ తీర్చుకోవాలని భావించారు. అందుకోసం మణప్పురంను ఆనుకొని ఖాళీగా ఉన్న షటర్లో ఈనెల 7న 20-35 సంవత్సరాలలోపు ఉన్న ముగ్గురు యువకులు పరుపులు కుట్టుకుంటామని రూ.60 వేల చెక్కును అడ్వాన్స్‌గా ఇచ్చి అద్దెకు తీసుకున్నారు.

ఈ క్రమంలో వారికి సంబంధించిన ఐడెంటిటీని ఇవ్వాల్సిందింగా సదరు షటర్ యజమాని కోరడంతో.. ఉప్పల్‌ చిరునామాతో ఉన్న గోపాల్‌ విశ్వకర్మ పేరుతో ఉన్న ఆధార్ కార్డ్‌, కరెంట్‌ బిల్లు యజమానికి చూపించారు. చోరీ కోసం పకడ్బందీగా రెక్కీ నిర్వహించారు. సరిగ్గా అర్థరాత్రి వేళ తమ షటర్ కు మణప్పురం కంపెనీకి మధ్యనున్న గోడకు గ్యాస్‌ కట్టర్ తో కన్నంవేసి లోపలికి ప్రవేశించారు. ముందుగా తామెవరో ఎవరూ గుర్తించడానికి వీలులేకుండా సీసీ కెమెరాల కనెక్షన్‌ తొలగించేందుకు ప్రయత్నం చేశారు. వైర్లు కట్ చేయడానికి కూడా యత్నించారు. మొత్తానికి సీసీటీవీ ఫూటేజీ రికార్డింగ్ కట్ అయ్యింది. ఇక తమ పనిలో దొంగలు నిమగ్నమయ్యారు.

అదే సమయంలో మణప్పురం ప్రధాన కార్యాలయంలో తమ శాఖల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ఫూటేజీని డీఎల్ఆర్ ద్వారా మానిటరింగ్‌ చేస్తున్న సిబ్బంది.. ఈ విషయాన్ని గమనించి వెంటనే కొంపల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ ద్రావిడ్ కు సమాచారం అందించారు. ఆయన స్థానికంగా ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి ఆఫీస్ వద్దకు పంపించారు. అలాగే, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గుర్తించిన దొంగలు షటర్ లో ఉన్న బాత్రూమ్‌ కిటికీలోంచి పక్కనే ఉన్న శ్మశాన వాటికలోకి దూకి పారిపోయారు. దొంగల కోసం నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, సీసీ కెమెరాలు, దొంగలు వినియోగించిన ఫొన్‌ నంబర్‌ ఆధారంగా ఉత్తరప్రదే కు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నామని సీఐ మహేష్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles