IT sleuths raids on LEPL at vijayawada లింగమనేని ఎస్టేట్స్ పై ఐటీ దాడులు.. పలు ఫైళ్లు స్వాధీనం..

It raids on lingamaneni estates in vijayawada of andrha pradesh

IT Raids,LEPL, Lingamaneni Estates, Income Tax Raids, Vijayawada, TDP, Insider Trading, Lingamaneni Ramesh, Sri Chaitanya College, Narayana college, Income Tax officials, corperate colleges, corporate offices, Madhapur, Hyderabad, Students fees, Teachers salaries, irregularities in financial issues, Madhapur, Andhra Pradesh, Politics

The Income Tax Department officials have conducted a surprise raid on LIngamaneni Estates and siezed few records. Lingamaneni Ramesh the owner of the LEPL had recieved many allegations in inside trading of CRDA lands in Amaravati area.

లింగమనేని ఎస్టేట్స్ పై ఐటీ దాడులు.. పలు ఫైళ్లు స్వాధీనం..

Posted: 03/05/2020 11:53 AM IST
It raids on lingamaneni estates in vijayawada of andrha pradesh

తెలుగు రాష్ట్రాలలోని సినిమా తారాలు, రాజకీయ నేతల తరువాత, కార్పోరేట్ కాలేజీలపై దాడులు నిర్వహించిన ఆదాయ పన్నుశాఖ తాజాగా మరోమారు ప్రముఖులను టార్గెట్ చేసింది. టీడీపీ నేతలను ఎన్నికలము ముందు టార్గెట్ చేసిన ఆదాయ శాఖ.. ఇటీవల కూడా అదే క్రమంలో టీడీపీ అధినేత మాజీ వ్యక్తిగత కార్యదర్శి సహా పలువురు జిల్లా నేతలకు సంబంధించిన ఇళ్లలో దాడులు చేసింది. అంతేకాదు ఈ విషయంలో చిన్న కార్లిటీ కూడా ఇచ్చిన ఆధాయ శాఖ తెలుగు రాష్ట్రాల్లో తాము నిర్వహించిన దాడులలో ఏకంగా రూ.2000 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించినట్లు కూడా పేర్కోంది.

అయితే ఈ విషయంలో ఇంకా కొంచెం క్లారిటీ మిస్ అవుతున్న ఆదాయశాఖ అధికారులు.. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ పార్టీతో పరోక్షంగా సంబంధమున్న వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తన గెస్ట్ హౌజ్ ను అద్దెకు ఇచ్చిన లింగమనేనిపై ఐటీ దృష్టిసారించింది. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఈపీఎల్) కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. విజయవాడలోని రామచంద్రనగర్ లో ఉన్న ఆ సంస్థ కార్పొరేట్ భవనంలో సాయంత్రం ప్రారంభించిన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. తనిఖీలు జరుగుతున్నప్పుడు భవనంలోకి ఎవరినీ అనుమతించలేదు.

ఐటీ దాడుల సందర్భంగా పలు రికార్డులు, ఫైళ్లు పరిశీలించిన ఐటీ ప్రత్యేక బృందాలు.. కంప్యూటర్లలోని డేటాను విశ్లేషించి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం. రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ అధినేత లింగమనేని రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం విశేషం. సాయంత్రం ఆరు గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు దాడులు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles