covid-19 upasana konidela suggested precautions అపోలో అసుపత్రిలో కరోనా కలవరం.. వెల్లడించిన ఉపాసన

Upasana konidela alert tweet on hyderabad first coronavirus case

Apollo Foundation, apollo chair person, upasana konidela, covid -19, hyderabad first corona case, secundrabad apollo, social media, twitter account, Gandhi Hospital

Apollo Foundation chair person upasana konidela had alerted the people of hyderabad along with suggestions and prevention to be taken on spreading of corona virus in her social media account with the precuationary measures taken on hyderabad first coronavirus case

అపోలో అసుపత్రిలో కరోనా కలవరం.. వెల్లడించిన ఉపాసన

Posted: 03/03/2020 11:01 AM IST
Upasana konidela alert tweet on hyderabad first coronavirus case

సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన రోగి వచ్చాడన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, అది నిజమేనని అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్ పర్సెన్ ఉపాసన కొణిదెల వెల్లడించారు. సికింద్రాబాద్ లోని అపోలో అసుపత్రి కేసును గుర్తించామని అమె తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో హైదరబాద్‌లో తొలి కోవిడ్‌ కేసు నమోదైందని ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ప్రస్తుతం సదరు రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దుబాయ్‌ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్, వీడియోను పెట్టిన ఆమె, కరోనా వైరస్ పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఉపాసన చెప్పిన జాగ్రత్తలు
* జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి.. కరోనా వ్యాధి లక్షణాలు.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
* ఈ వైరస్ కు ఇప్పటి వరకూ ఎలాంటి ఔషధం లేదు.  
* హోమియోపతిలో ఔషధం ఉందని అంటున్నా.. ఇప్పటికీ ధృవీకరించబడలేదు
* చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోంది. మాస్కులు తప్పని సరిగా వాడండి
* జంతువుల ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని అంటున్నారు. ఇదీ నిర్ధారణ కాలేదు.
* మంసాహారం తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదు. మంసాన్ని బాగా ఉడికించి తినండి
* మీ పిల్లలకు కానీ, పెద్ద వారికి కానీ దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి.
* ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles