Chandrababu arrested in Vizag over security measures విశాఖలో టెన్షన్.. చంద్రబాబు ముందస్తు అరెస్ట్..

Police arrests chandrababu naidu in visakhapatnam over security measures

CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Chandrababu, chandrababu Praja Chaitanya Yatra, TDP Praja Chaitanya Yatra, chandrababu visakhapatnam, Praja Chaitanya Yatra Visakhapatna, YCP party, TDP party, Visakha airport, Praja Chaitanya Yatra, vizag, Visakhapatnam, Andhra Pradesh, Politics

TDP chief Chandrababu has been arrested by Visakhapatnam police on Thursday under section 151 in view of security measures. The police have taken him to the airport after a much struggle with the protesters. It remains to be seen whether Naidu flees to either Hyderabad or Vijayawada.

విశాఖలో టెన్షన్.. చంద్రబాబు ముందస్తు అరెస్ట్..

Posted: 02/27/2020 04:58 PM IST
Police arrests chandrababu naidu in visakhapatnam over security measures

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం ఉదయం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును భారీ సంఖ్యలో విమానాశ్రయం వద్ద గుమ్మిగూడిన వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ ను ముందుకు కదలనీయకుండా అడ్డుగా పడుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినదించారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన తన కాన్వాయ్ లోనే కూర్చిండిపోయినా.. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టడంలో పోలీసులు విఫలమయ్యారు.

తమ అధినేత వస్తున్నాడన్న సమాచారంతో టీడీపీ కార్యకర్తలు కూడా విశాఖ విమానాశ్రాయానికి భారీ సంఖ్యలో చేరుకుంటారని భావించిన పోలీసులు విమానాశ్రయానికి కేవలం 50 మందికి మాత్రమే అనుమతిని ఇచ్చారు. అయితే టీడీపీ కార్యకర్తలను కేవలం యాభై మందిని పరిమితం చేసిన పోలీసులు, అధికార పార్టీ వైసీపీవారిని మాత్రం వేలసంఖ్యలో ఎలా రానిచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నలు సంధించారు. పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని అరోపించారు. ఒక పార్టీకి ఒక నిబంధన.. మరో పార్టీకి మరో నిబంధన ఎలా పెడతారని ప్రశ్నించారు.

కనీసం వైసీపీ కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నా.. వారిని నిలువరించే ప్రయత్నాలు పోలీసులు చేయలేదంటే ఇది పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరని దుయ్యబట్టారు. ఈ క్రమంలో సాయంత్రం చంద్రబాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్ జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. చంద్రబాబును విమానాశ్రయం నుంచి ఎక్కడకు తరలిస్తారనేది తెలియాల్సి ఉంది.

ఉదయం నుంచి విశాఖ విమానాశ్రయం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ ముందుకు కదిలే క్రమంలో వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టామాటాలు, చెప్పులు విసిరారు. దీంతో ఆయనను కాన్వాయ్ లోనే వుంచారు పోలీసులు. పాదయాత్రగా వెళ్లే ప్రయత్నం చేసినా.. భద్రతా కారణాల రిత్యా పోలీసులు సూచనల మేరకు విరమించుకుని కాన్వాయ్ కే పరిమితం అయ్యారు. మూడు గంటల పాటు వేచి చూసినా వైసీపీ కార్యకర్తలను చదరగొట్టడంలో పోలీసులు విఫలం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోడ్డుపై భైఠాయించి పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో కాసేపటి తరువాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles