Supreme Court pulls up police over Delhi clashes అనాటి హింసను పునారావృతం కానివ్వం: సుప్రీంకోర్టు

Delhi violence lives could have been saved had the police acted in time says sc

citizenship amendment act, delhi violence, delhi updates today, delhi supreme court, supreme court, delhi riots, Shaheen Bagh, Supreme Court, CAA, NRC, CAA Protest, CAA pro Rally, Delhi Violence, political news, politics nation, Crime

The Supreme Court pulled up the Delhi Police over their handling of the ongoing clashes in the capital, Justice KM Joseph while hearing the petition lamented the "lack of professionalism" in the police force saying it was a malaise across the country that police waited for orders before acting.

ఢిల్లీ హింసాత్మక ఘటనలు పోలీసుల వైఫల్యమే: సుప్రీంకోర్టు

Posted: 02/26/2020 06:33 PM IST
Delhi violence lives could have been saved had the police acted in time says sc

ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తీరు సముచితంగా లేదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు సకాలంలో సరైన చర్యలు తీసుకుని వుండివుంటే అసువులు బాసిన మృతులను కాపాడివుండి వుండవచ్చునని పేర్కోంది. ఇంతగా హింస చెలరేగకుండా అడ్డుకట్ట పడివుండేదని కూడా తెల్చిచెప్పింది. రెండు వర్గాల వారు పరస్పరం ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకుని ఉండాల్సిందని తెలిపింది.

ఈ మేరకు దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్భంగా ఇద్దరు సభ్యుల గల ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ ఎస్ కె కౌల్ ఇద్దరూ పోలీసుల నిర్లక్ష్యపు పనితీరుపై మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులపై సకాలంలో సరైన చర్యలు తీసుకుని వుంటే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమయ్యేవి కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరులో ప్రోఫెషనలిజం కొరవడడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. చట్టం సక్రమంగా పనిచేయకపోవడంతోనే న్యాయం వారి పని చేయాల్సివస్తోందని, ఈ రెండింటి మధ్య తేడాను గమనించాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఇక అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో ఈ అల్లర్ల విషయమై దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా ‘‘దేశంలో 1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతం కానివ్వ’’మని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడికి జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన సమయం వచ్చిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

‘ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. 1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతానికి మేం ఎప్పటికీ ఒప్పుకోం అని స్పష్టం చేసింది. ప్రతి ఒక్క బాధితుడి వద్దకు చేరుకోవాల్సిన సమయం ఇది. ప్రతి పౌరుడికి జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యం నింపేందుకు బాధితులు, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలని పేర్కోంది. ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సందర్శించాలని సూచనలు చేసింది.

అల్లర్లలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పేర్కోంది. మృతుల కుటుంబాలతో మాట్లాడి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలి’ అని కోర్టు ఆదేశించింది. అల్లర్లతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసి, సరైన సౌకర్యాలు అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సరైన సమయంలో చేరేలా చూడాలని సూచించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shaheen Bagh  Supreme Court  CAA  NRC  CAA Protest  CAA pro Rally  Delhi Violence  political news  politics nation  Crime  

Other Articles