భారత్- అమెరికా మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలతో పాటుగు మరో రెండు ఒప్పందాలను కూడా తాము కుదుర్చుకున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అపాచీ, ఎం-16 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని వివరించారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో జరిగిన ట్రంప్-మోదీ మధ్య పలు అంశాలపై ముఖాముఖిగా జరిగిన చర్చలు ముగిసిన తరువాత ఇరువురు నేతలు మీడియాకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.
దీంతో పాటు 5జీ సాంకేతిక, ఇండో-ఫసిపిక్ ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా తమ చర్చలు సాగినట్లు తెలిపారు. వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేసిన అనంరతం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ పర్యటన తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. భారత్ లో తమకు లభించిన ఆత్మయ ఆతిధ్యాన్ని ఎప్పటికీ మరవలేమన్నారు. రెండు దేశాల మధ్య ఫలవంతమైన పర్యటనగా ఇది ఉంటుందని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని ట్రంప్ తెలిపారు.
రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదనా్ని ఏరివేసేందుకు అ దేశంతో కలసి అమెరికా కృషి చేస్తోందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై చర్చించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని ఈ విషయంలో అస్ట్రేలియా, జపాన్ లతో ఇరుదేశాల సహకారం కోనసాగుతోందని ట్రంప్ వెల్లడించారు. సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాలు జరుపుతున్న చర్చల్లో ఎంతో పరోగతి సాధించామని తెలిపారు. త్వరలో గొప్ప ఒప్పందం కూడా జరుగుతుందని ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ సతీసమేతంగా భారత్ రావడం ఆనందం కలిగించిందని, గత ఎనిమిది నెలల్లో తానూ, ట్రంప్ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. అమెరికా-భారత్ మధ్య స్నేహ బంధం పెరిగిందని, 21వ శతాబ్దానికి అమెరికా-భారత్ స్నేహం ముఖ్యమైందని చెప్పారు. అమెరికా-భారత్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని, డ్రగ్స్‌పైనా నిరంతరం పోరాడుతున్నామని ప్రధాని మోదీ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more