Karnal man shot dead in US store అగ్రరాజ్యంలో అసువులు బాసిన మరో భారతీయుడు

Indian shot dead by masked man at grocery store in los angeles

Indian Man, Indian Shot Dead, Maninder Singh Sahi, 7-Eleven, 7 11, US, Whittier City, Los Angeles, California, America, crime

A masked man shot dead an Indian national at a grocery store in Los Angeles. Maninder Singh Sahi, was married and a father of two. Originally from Karnal, Mr Sahi had arrived in the US less than six months ago and had sought political asylum. He was working at a 7-Eleven grocery store in the Whittier City in Los Angeles County of California.

అగ్రరాజ్యంలో అసువులు బాసిన మరో భారతీయుడు

Posted: 02/24/2020 01:27 PM IST
Indian shot dead by masked man at grocery store in los angeles

ఆగ్రరాజ్యానికి వలస వెళ్లిన మరో భారతీయుడు అక్కడ తుపాకీ తూటాలకు బలైపోయాడు. గత ఏడేళ్లుగా అక్కడి ఓ గ్రాసరీ స్టోర్ లో పనిచేస్తున్న భారతీయుడ్ని దొంగతనం కోసం దుకాణంలోకి చొరబడిన ఓ దుండగుడు అసువులు బాసాడు. అమెరికాలోని కౌంటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిధిలోని లాస్ ఏంజెలెస్ లో ఈ దర్ఘటన జరిగింది. లాస్ ఏంజెలెస్ పోలీసుల కథనం ప్రకారం.. లాస్ ఏంజెలెస్ పరిధిలోని విడ్టియర్ నగరంలో వున్న గ్రాసరి స్టోర్ లో హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన మణిందర్ సింగ్ సాహి ఉద్యోగం చేస్తున్నాడు.

గత ఏడేళ్లుగా మణిందర్ సింగ్ ఈ దుకాణంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎంతో నమ్మకంగా విధులు నిర్వహించడంతో స్టోర్ యాజమాన్యం అతడ్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఏడేళ్లలో ఎప్పుడు ఎలాంటి దుర్ఘటన చోటుచేసుకోలేదు. అయితే గత శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు. డబ్బులు ఇవ్వమని మణిందర్ సింగ్ ను అడగ్గా అతను నిరాకరించాడు.

దీంతో మణిందర్ పై కాల్పులు జరిపిన దుండగడు డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు దుండగుడు ఏ హానీ తలపెట్టలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి బాధితుడు మరణించినట్లుగా తేల్చారు. గత నెలలో ఇండియాకు వచ్చిన మణిందర్.. అదే నెల చివరిలో తిరిగి అమెరికా చేరుకున్నాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు మణిందర్ సోదరుడు తెలిపాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Man  Indian Shot Dead  Maninder Singh Sahi  7-Eleven  7 11  US  Whittier City  Los Angeles  California  America  crime  

Other Articles