Bengaluru student Amulya Leona booked for sedition ఎంఐఎం సభలో పాక్ నినాదాలు.. యువతిపై దేశద్రోహం కేసు

Bengaluru student booked for sedition over pakistan slogan at anti caa nrc protest

Treason Case, Amulya, AIMIM anti CAA Meeting, MP Asaduddin Owaisi, stundent, Amulya, MIM, Pakistan Zindabad slogans, anti CAA Protest, bengaluru, karnataka, crime

Acase of sedition has been registered against a young woman, who raised pro-Pakistan slogans at a protest rally, against the CAA and NRC at Freedom Park. The rally was attended by AIMIM chief Asaduddin Owaisi, who tried to stop the woman,

ITEMVIDEOS: ఎంఐఎం సభలో పాక్ నినాదాలు.. యువతిపై దేశద్రోహం కేసు

Posted: 02/21/2020 11:47 AM IST
Bengaluru student booked for sedition over pakistan slogan at anti caa nrc protest

కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ ఫౌరుల గణనలను (ఎన్ఆర్సీ) వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఓ యువతి చేసిన నినాదాలు కలకలం సృష్టించాయి. యువతి నినాదాలతో షాక్ కు గురైన నిర్వాహకులు అమె నుంచి మైక్ లాగేసుకున్నా అమె వినిపించుకోలేదు.. అప్పటికే అమెను పక్కకు లాగుతున్న అమె వేదికపై నుంచి మైక్ లేకుండానే ఏదో చెప్పబోయింది. ఈ క్రమంలో అమెను నిర్వహకులు, పోలీసులు కిందకు తీసుకెళ్లారు. పోలీసులు విద్యార్థినిపై దేశ ద్రోహం కింద కేసు పెట్టారు కటకటాల వెనక్కి పంపారు.

ఈ సభకు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు... అయితే, ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత అమూల్య అనే యువతి.. మైక్ అందుకుని.. పాకిస్థాన్ జిందాబాద్‌.. పాకిస్థాన్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.. అయితే, ఆ యువతిపై బెంగళూరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆమె బెయిల్‌ను తిరస్కరించారు.. 14 రోజుల పాటు కస్టడీ విధించారు. కాగా, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించి వెళ్లిపోతున్న సమయంలో.. ఆ యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది.

యువతి వ్యాఖ్యలు విన్న ఒవైసీ షాక్ కు గురయ్యారు.. వెంటనే ఆమె దగ్గరున్న మైక్‌ను లాక్కొన్నే ప్రయత్నం చేశారు.. ఆయినా వినని ఆ యువతి.. అప్పుడు హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినదించింది.. అనంతరం.. ఆమె దగ్గరున్న మైక్‌ను నిర్వహకులు తీసుకోగా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. ఇక, ఈ ఘటనపై స్పందించిన ఒవైసీ.. ఆ యువతి ఎవరో తమకు తెలియదని, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, భారత్‌ కోసమే ఉంటామని, పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు ఒవైసీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Treason Case  Amulya  MIM  Pakistan Zindabad slogans  anti CAA Protest  bengaluru  karnataka  crime  

Other Articles