IIT-M scholar, held for filming a woman student విద్యార్థినుల వాష్ రూమ్ లో కెమెరా.. కీచక ఫ్రొఫెసర్..

Iit m scholar held for filming a woman student in washroom

iitm, iit madras, research scholar, bathroom, toilet, restroom, chennai police, tamil nadu, Crime

A research scholar of IIT Madras, who was nabbed for allegedly filming a woman student in the washroom on campus, was granted bail by a court here.

విద్యార్థినుల వాష్ రూమ్ లో కెమెరా.. కీచక ఫ్రొఫెసర్..

Posted: 02/20/2020 09:55 PM IST
Iit m scholar held for filming a woman student in washroom

ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లోని విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన స్కాలర్.. నిసిగ్గుగా మహిళల రెస్ట్ రూమ్ లో తన మొబైల్ ఫోన్ కనబడకుండా పెట్టి అక్కడి దృశ్యాలను బంధించేందుకు యత్నించి అడ్డంగా అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థిని పిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసే శుభం బెనర్జీగా గుర్తించిన పోలీసులు.. అతడ్ని కటకటాల వెన్కకి పంపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని ఐఐటీ మద్రాస్‌లో రీసెర్చి కోసం వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ల్యాబ్‌ వద్ద రెస్ట్‌ రూమ్‌కు వెళ్లింది. అక్కడ కిటికీ వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్టు గుర్తించి.. తీసి చూడగా ఫోన్‌ కెమెరా ఆన్‌లో ఉన్నట్టు గుర్తించింది. వెంటనే గది నుంచి బయటకు వచ్చేసి పురుషుల బాత్‌ రూమ్‌ను లాక్‌ చేసింది. అనంతరం రక్షణ సిబ్బందిని పిలిచింది.

ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌ భద్రతా సిబ్బంది వచ్చి బాత్‌ రూమ్‌ను తెరిచి చూడగా.. అందులో శుభం బెనర్జీ ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ను స్వాధీనం చేసి చూడగా అందులో వీడియోలు, ఫొటోలు కనిపించలేదు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెనర్జీని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మొబైల్‌లో ఎలాంటి వీడియోలు లభించలేదనీ.. ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iitm  iit madras  research scholar  bathroom  toilet  restroom  chennai police  tamil nadu  Crime  

Other Articles