Nirbhaya Case: Vinay Sharma injures himself by hitting head on wall నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం

Nirbhaya case new trick of vinay sharma convicted in nirbhaya case injures himself by hitting head on wall

Nirbhaya convicts, Execution, Justice Suresh Kait, Delhi High Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Vinay Sharma, one of the four convicts, slammed his head on the jail wall on Monday, injuring him. He is staying in barrack number three of Tihar Jail. Jail authorities said that Vardan in-charge is keeping a close watch on Nirbhaya's convicts, despite which Vinay has hurt himself.

‘నిర్భయ’ కేసు: జైలులో దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం

Posted: 02/20/2020 12:38 PM IST
Nirbhaya case new trick of vinay sharma convicted in nirbhaya case injures himself by hitting head on wall

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే న్యాయబద్దంగా వారికి వున్న అన్ని హక్కులు, అవకాశాలను వినియోగించుకునేందుకు దోషులకు ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువును కేటాయించడం.. అది ముగిసిపోయాయి. దీంతో నిర్భయ కేసులోని దోషులకు శిక్షను ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతంతో జనవరి 22, ఫిబ్రవరి 1.. రెండు పర్యాయాలు దోషులకు డెత్ వారెంట్ జారీ చేసిన పటియాల న్యాయస్థానం.. తాజాగా మార్చి 3న దోషులకు ఉరి శిక్ష విధించాలని డెత్ వారెంట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తమకు ఉరి శిక్షను అమలు జరగకుండా తప్పించుకునే మార్గాలను దోషులు అలోచిస్తున్నారు. పవన్ గుప్తా మినహా మిగిలిన ముగ్గురు దోషులు న్యాయబద్దంగా అన్ని హక్కులను, అవకాశాలను వాడుకున్నారు. దీంతో తమకు న్యాయబద్దంగా ఎలాంటి అవకాశాలు లేవని భావించిన దోషులు.. వక్రమార్గంలో శిక్ష వాయిదా వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డెత్ వారెంట్ జారీ అయిన దోషులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు తీహార్ జైలు అధికారులు. అయితే ఈ భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆత్మహత్యయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు దోషులలో ఒకడైన వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు కేటాయించిన సెల్ లో వినయ్ శర్మ.. ఈ దారుణానికి ఒడిగట్టాడని జైలు అధికారులు తెలిపారు. ఉరి శిక్ష పడిన దోషులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు.. వారు మానసిక అందోళనకు గురై ఎలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా కూడా చూసుకుంటామన్నారు. వారి సెల్ లో కూడా ఎలాంటి వస్తువులు లేకుండా 24 గంటలూ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. అయితే వినయ్ శర్మ తన సెల్‌ లో గోడకు తలను బాదుకున్నాడని, ఈ ఘటనలో వినయ్‌ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు.  

కాగా, ఇప్పటివరకూ తన ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని దోషి పవన్‌ గుప్తా, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో 3వ తేదీన వారి ఉరి అనుమానంగానే ఉంది. చివరి నిమిషంలో దోషులు తమ ఉరిశిక్షపై న్యాయస్థానాలను అశ్రయించి డెత్ వారెంట్ అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీళ్లపర్యంతమై న్యాయస్థానాన్ని కోరింది. ‘‘చేతులెత్తి మొక్కుతున్నా నా కూతురికి న్యాయం చేయండీ’’ అని న్యాయస్థానంలోనే అమె ప్రాధేయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles