UP BJP MLA booked in gang rape case రెండేళ్లుగా మహిళపై గ్యాంగ్ రేప్.. బీజేపి ఎమ్మెల్యేపై కేసు

Bjp mla ravindranath tripathi nephew and 5 others accused of raping a woman

Ravindranath Tripathi, Bhadohi, BJP MLA, nephew, Sandip Tripathi, five family members, gang rape, rape, abortion, rape shocker, Sexual Assault, Bhadohi BJP MLA, Uttar Pradesh, Crime

A woman has accused seven people, including sitting BJP MLA from Bhadohi, Ravindranath Tripathi, his nephew Sandip Tripathi and their five family members, of raping her repeatedly between 2016 and 2017. The woman has further alleged that she was forced to abort when she was two months pregnant.

రెండేళ్లుగా మహిళపై గ్యాంగ్ రేప్.. బీజేపి ఎమ్మెల్యేపై కేసు

Posted: 02/19/2020 09:27 PM IST
Bjp mla ravindranath tripathi nephew and 5 others accused of raping a woman

అత్యాచార ఆరోపణలపై నేపథ్యంలో అధికార బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠితో పాటు, ఆయన కుటుంబసభ్యులపై బదోహీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తనను ఓ హోటల్లో బంధించి పలుమార్లు ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధిత మహిళ ఈ నెల 10న బదోహి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు బదోహి పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బదోహీ నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ ఓ మహిళ (40)పై అత్యాచారం చేశాడు. ఎమ్మెల్యేతో పాటు అతని మేనల్లుడు సహా మొత్తం ఏడుగురు ఓ మహిళను హోటల్‌ గదిలో బంధించి లైంగిక దాడి చేశారు. 2017లో ఈ ఘటన జరగగా బాధిత మహిళ ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారని, అందుకే ఇన్నాళ్లు మౌనం వహించానని ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే, అనుయాయుల కీచక క్రీడతో గర్భవతిని కూడా అయ్యానని కూడా పేర్కోంది.

అయితే ఎమ్మెల్యే అతని బంధువులు బలవంతంగా అబార్షన్‌​ చేయించారని వెల్లడించింది. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ఏఎస్పీ రవీంద్ర వర్మకు అప్పగించామని ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో ఎమ్మెల్యేపై అభియోగాలు నిజమని తేలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీతెలిపారు. కాగా, సదరు మహిళ స్టేట్‌మెంట్‌ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణ జరిపి చట్టపరమైను చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindranath Tripathi  Bhadohi  BJP MLA  nephew  family members  gang rape  rape  abortion  Uttar Pradesh  Crime  

Other Articles