మూఢాచారాలు, సంప్రదాయం పేరుతో గుజరాత్ లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై జరిపిన అమానుష చర్యలను నిసిగ్గుగా సమర్థించుకుంటోంది. ఇందుకు ఓ స్వామీజీ గతంలో చేప్పిన విషయాలను వీడియో రూపంలో తెరపైకి తీసుకువచ్చింది. తాము చేసిన దాంట్లో ఎలాంటి తప్పులు లేవని అనాధిగా వస్తున్న అచారాలనే తాము ఫాలో అవుతున్నామని తమ చర్యలను సమర్థించుకుంది. ఇప్పటికే విద్యార్థినులను శారీరికంగా, మానసింకంగా కుంగదీసి అవమానించారన్న పిర్యాదులపై కాలేజీ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యార్థినుల రుతుస్రావంపై పరీక్షించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తకావడంతో.. తాము చేసిన దాంట్లో తప్పు లేదని యాజమాన్యం ఓ వీడియోను తెరపైకి తీసుకువచ్చింది. ఈ వీడియోలో స్వామి కృష్ణస్వరూప్ దాస్ జీ చెప్పిన మాటలు వున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో స్వామినారాయణన్ మందిరం కూడా వుంది. ఈ మందిరం ఆధ్వర్యంలోనే సహజానంద గాల్స్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన కూడా తమ యాజమాన్య సిబ్బందికి మద్దతుగానే ఈ వ్యాఖ్యలు చేశారా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..
‘‘మన శాస్త్రాలలో వున్నదే చెబుతున్నాను.. నా అభిప్రాయాలు నచ్చినా, నచ్చకపోయినా నేను పట్టించుకోబోను.. పురుషులు వంట నేర్చుకోవాలి.. నెలసరి (రుతుస్రవం) సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా, ఆ వంట తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారు.. ఇది నేను చెప్పడం లేదు.. మన శాస్త్రాలలో వుంది‘ అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన కాలేజీ యాజమాన్య చర్యలను సమర్థించేందుకే చేశారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రుతుస్రావం సమయంలో వంటగదిలోకి రావడంతో పాటు ఇతర విద్యార్థినులతో పాటు కలసి బోజనం చేస్తున్నారని.. దీనికి తోడు అక్కడి దేవాలయాల్లోకి కూడా ప్రవేశించి సుచీ, శుభ్రం లేకుండా, మడీ, అచారాలను మంటగలుపుతున్నారన్న హాస్టల్ వార్డెన్ పిర్యాదుతో ప్రిన్సిఫల్ హాస్టల్ లోని 68 మంది విద్యార్థినులను లోదుస్తులు విప్పించి పరీక్షించడం. వారిపై అమానుష చర్యలకు పాల్పడిందని పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత కూడా తమ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కాలేజీ యాజమాన్యం స్వామీజీ విడియోను తెరపైకి తీసుకువచ్చి.. మరీ ప్రచారం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more