Car falls off Bharat Nagar flyover మితిమీరిన వేగం.. భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు..

Car falls off railway flyover bridge in hyderabad one died several injured

rash driving, sohail, pandit nehrunagar, 1 dead, five injured, bharat nagar railway flyover, Bharat Nagar, Hyderabad, Telangana, crime

In a tragic incident, one person died on the spot and four severely injured after their car falls off Bharat Nagar flyover. According to the sources, the incident took place when the persons are on the way from Kukatpally to Sanath Nagar and they are identified as the residents of Borabanda.

మితిమీరిన వేగం.. భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు..

Posted: 02/18/2020 10:16 AM IST
Car falls off railway flyover bridge in hyderabad one died several injured

అర్థరాత్రి.. నిషీదిలో నిశ్శబ్దంగా (పెద్దగా వాహనాలు లేకుండా), నిర్జనంగా వున్న రోడ్లు.. అంతే వేగానికి కళ్లెం లేకుండా రయ్ మంటూ ఓ దూసుకోచ్చిన కారు.. వాయువేగంతో పోటీ పడుతున్నట్లు వెళ్తూ.. భరత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి చేరింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా అదుపుతప్పంది. వేగంతో పోటీ పడే క్రమంలో మన కన్నులు కూడా మనల్ని మోసం చేస్తాయని, నీడ కూడా ఏదో అనుకుని హడలిపోయే ప్రమాదముందని పెద్దలు చెబుతున్నా.. పెడచెవిన పెట్టిన ఓ యువకుడికి యుక్త వయస్సులో నిండునూరేళ్లు నిండిపోయాయి. తనను కన్నవారికి అండగా వుండాల్సిన వయస్సులో వారికి కడుపుకోతను మిగుల్చుతూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

హైదరాబాద్ నగరంలోని భరత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి వేగంగా దూసుకెళ్తున్న కారు.. అదుపుతప్పి బ్రిడ్జి పిట్టగోడను ఢికొని కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ వేకువ జామున రాత్రి 2.45 నిమిషాల సమయంలో చోటుచుసుకుంది. ప్రమాదఘటన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. కారు పడిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఆరుగురు వున్నారని సమాచారం.

మృతుడు బొరబండ ప్రాంతంలోని పండిత్ నెహ్రైనగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారు సోహెల్ అనే యువకుడిదని, రాత్రి పదిన్నర గంటల సమయంలో స్నేహితులతో కలసి భరత్ నగర్ నుంచి ఎర్రగడ్డ వైవు వస్తుండగా, కారు అదుపుతప్పి కిందపడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో సోహేల్ మరణించగా, మిగిలిన నలుగురు చికిత్స పోందుతున్నారు. కాగా మిగిలిన మితిమీరిన వేగమే కారు ప్రమాదానికి కారణమని చెబుతున్న పోలీసులు.. డ్రైవింగ్ సీట్లో వున్న యువకుడు మద్యం సేవించాడా.? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles