Deoband is 'Gangotri' of terrorism: Giriraj Singh నోరుజారిన కేంద్రమంత్రిపై విమర్శల వెల్లువ

Deoband is gangotri of terrorists produced hafiz saeed says giriraj singh

PM Modi, Narendra Modi, Deoband, Shaheen Bagh, Giriraj Singh, Hafiz Muhammad Saeed, Gangotri, anti-CAA stir, uttar pradesh, crime

Union minister Giriraj Singh has said Uttar Pradesh's Deoband is a factory producing terrorists and termed it "aatankvaad ki Gangotri". Reacting to this Congress leader and ex-MLA Imran Masood and Saharanpur MP Haji Fazlur Rehman too flayed the minister for his statement and said Deoband has been the "karmabhoomi" of freedom fighters.

నోరు జారిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పై విమర్శలు

Posted: 02/13/2020 11:47 AM IST
Deoband is gangotri of terrorists produced hafiz saeed says giriraj singh

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆంధోళనాకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఇటీవల సీఏఏ నిరసన టెంట్లు.. మానవ బాంబుల ఉత్పత్తి కేంద్రాలంటూ.. ఇక్కడ ఆత్మహుతి దళాలు తయారు అవుతున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన మరోమారు అలాంటి అగ్గిరాజుకునే వ్యాఖ్యలనే మరోమారు చేశారు. అయితే ఈ సారి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ జిల్లా దేవ్ బంద్ పట్టణాన్ని ఆయన ఉగ్రవాదుల అడ్డాగా అభివర్ణించారు. షహరాన్ పూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారికి అవగాహన కల్పించలేమని, ఎందుకంటే వారంతా దేవ్ బంద్ పట్టణం వారేనని అన్నారు. హఫీజ్ సయీద్ సహా ప్రపంచంలోని ఉగ్రవాదులందరూ ఇక్కడ జన్మించినవారేనంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని మంత్రి ఈ ఆందోళనలు భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నవి పేర్కోన్నారు.

భారత్ దేశంలో జరుగుతున్న ఖిలాఫత్ అందోళన అంటూ జేఎన్యూ విద్యార్థి షర్జీల్ ఇమామ్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఊటంకించారు. అక్కడితో ఆగని మంత్రి దేవ్ బంద్ పట్టణం ఉగ్రవాద ముఠాల అడ్డా అని తాను గతంలోనే చెప్పానని అన్నారు. కాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మనస్సు పూర్తిగా ద్వేషంతో నిండుకుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇమామ్ మసూద్ విమర్శించారు. ఎంతలా ఆయన మనస్సు నిండుకుందో చెప్పడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని.. పవిత్రమైన గంగోత్రిని కూడా అవమానించే స్థాయికి ఆయనలో ద్వేషం చేరుకుందని అన్నారు.

సహారన్ పూర్ ఎంపీ హజీ ఫజ్లూర్ రెహ్మాన్ కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారత దేశం కర్మభూమి అంటూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది ప్రాణార్పణ చేశారని  చెప్పుకునే పరిస్థితి పోయి.. దేవ్ బంద్ ఉగ్రవాదుల అడ్డా అని చెప్పుకునే రోజులు వచ్చాయని విమర్శించారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో దేవ్ బంద్ లోని ఉలేమాలు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారని, అనేకులు జైళ్ళపాలయ్యారని కూడా చెప్పారు. అంతటితో ఆగని రెహ్మాన్.. దేశస్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారికి వెన్నుదన్నుగా నిలిచి దేశంలో హిందువులుగా, ముస్లింలుగా విడిపోయేందుకు కారణమైనవారు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని బీజేపిపై పరోక్షంగా విమర్శలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles