Amaravati farmers stage protest at film chamber అమరావతి కోసం ఫిల్మ్ చాంబర్ వద్ద విద్యార్థుల ఆందోళన!

Amaravati farmers stage protest at film chamber in hyderabad

Hanumanth Rao, Tulluru, Hyderabad, protest, heart attack, Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Amaravati Joint action committee leaders with students staged a protest at Film chamber in hyderabad demanding their support in favaur of Full Fledged capital at Amaravati.

అమరావతి కోసం ఫిల్మ్ చాంబర్ వద్ద విద్యార్థుల ఆందోళన!

Posted: 02/08/2020 12:34 PM IST
Amaravati farmers stage protest at film chamber in hyderabad

రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీపీఐ నేతలు వారికి మద్దతుగా నిలిచారు. అమరావతి పరిరక్షణ సభ్యులు, విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నినాదాలు చేశారు. అమరావతికి మద్దతు ప్రకటించకపోతే ఏపీలో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు వినతిపత్రం సమర్పించారు.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో గత యాభై రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోందని, ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున నిలబడే బాధ్యతను కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు తీసుకోవాలని, అందుకే, సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. ఏపీలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాజధానిని తరలించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నామని చెప్పారు. సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తోంది కనుక తమ అండగా నిలబడమని కోరుతున్నామని అన్నారు. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు, ఛాంబర్‌ సభ్యుల దృష్టికి తీసుకెళ్తామని, వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందిస్తామని ఛాంబర్‌ సభ్యులు ..ఐకాస నేతలకు హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles