Committees on capital bills constituted బొత్స, బుగ్గనల నేతృత్వంలో.. రెండు కమిటీల ఏర్పాటు..

Ap legislative council chairman appoints select committees on capital bills

Mohd Ahmed Shariff, Botsa Satyanarayana, Buggana Rajendranath Reddy, APCRDA Repeal bill, Decentralisation bill, Ummareddy Venkateshwarlu, Pilli Subhash Chandra Bose, Andhra Pradesh Capital, Select Committee, Select Committee, ap select committee, ap legislative council chairman, AP Legislative Council, Andhra Pradesh, Politics

Andhra Pradesh state legislative council chairman Mohd Ahmed Shariff on Thursday constituted two select committees to study the two crucial bills related to the state capitals, despite stiff resistance from the ruling YSR Congress party.

బొత్స, బుగ్గనల నేతృత్వంలో.. రాజధాని, సీఆర్డీఏ కమిటీల ఏర్పాటు..

Posted: 02/06/2020 07:04 PM IST
Ap legislative council chairman appoints select committees on capital bills

మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లు, రాజధాని అమరావతి అభివృద్ది మండలి ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ దూకుడు పెంచారు. ఈ రెండు బిల్లులను ఇటీవల మండలిలో సెలక్ట్ కమిటీలకు పంపుతూ తీర్మాణం చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని పార్టీలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ఇవ్వాలని కూడా లేఖను రాశారు. ఇక తాజాగా ఇవాళ ఈ రెండు బిల్లులకు రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ అదేశాలను జారీ చేశారు.

మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లుకు సెలక్ట్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ తరపున నారా లోకేష్, పీ.అశోక్‌బాబు, తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్‌.. వైఎస్సార్‌సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ఇక సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర యాదవ్, గౌనివారి శ్రీనివాసులు ఉన్నారు. వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజులు సభ్యులుగా ఉన్నారు.

కమిటీల ఏర్పాటు సంగతి అలా ఉంటే.. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి పేర్కోన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మంత్రులు, వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తాము ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండబోమని మండలి ఛైర్మన్ కు లేఖ రాసింది. నోటి మాట ద్వారా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదని.. కమిటీ ఏర్పాటుకు కొన్ని విధానాలు ఉంటాయంటున్నారు మంత్రులు. మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే ప్రక్రియ పూర్తి కాలేదని.. అలాంటప్పుడు విచక్షణాధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles