Delhi: Man opens fire at Shaheen Bagh ఢిల్లీలో షాహీన్ బాగ్ లో కాల్పుల కలకలం.

Man fires two rounds in air in shaheen bagh area taken into custody

KAPIL GUJJAR, CAA, shaheen bagh shooting, anti-caa protest, violence, delhi police, protesters, Politics

A man on Saturday fired two rounds in air in the Shaheen Bagh area in Jamia Nagar, where an anti-CAA protest is on, following which he was taken into custody by police, eyewitnesses said.

ITEMVIDEOS: ఢిల్లీ షాహీన్ బాగ్ లో కాల్పుల కలకలం.. అగంతకుడి అరెస్ట్

Posted: 02/01/2020 06:29 PM IST
Man fires two rounds in air in shaheen bagh area taken into custody

ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జామియా విశ్వవిద్యాలయంలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను దీక్షా శిభిరానికి చేరుకున్న ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపి ఓ విద్యార్థిని గాయపర్చిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా అలాంటిదే మరో ఘటన పునరావృతం కావడం కలకలం రేపుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద నిరసనకారులు అందోళన చేపట్టిన స్థలికి చేరకున్న ఓ యువకుడు గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు.

ఆకస్మాత్తుగా యువకుడు జరిపిన కాల్పులతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం అంతా కలకలం రేగింది. అందోళనకారులను టార్గెట్ గా చేసుకుని ఈ కాల్పలకు తెగబడటంతో నిరసనకారులు హడలిపోయారు. అక్కడే వున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా వున్నాయి. ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.

అయితే వారి వద్దకు వచ్చిన వ్యక్తి న పలువురిని టార్టెట్ గా చేసుకున్న యువకుడు కాల్పులు జరిపాడు. అయితే తాను కాల్పులు గాలిలోకి కాల్చి అక్కుడన్న విద్యార్థుల దృష్టిని ఆకర్సించాడు. సీఏఏకి మద్దతుగా గుజ్జార్ అనే వ్యక్తి రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడే నిలబడి ఈ దేశంలో హిందువుల మాటే చెల్లుబాటు కావాలని గుజ్జార్ నినాదాలు చేశాడు. దేశంలో రెండు వాదనలకు తావులేదని నినదించాడు. కాగా రెండు రోజుల వ్యవధిలో ఢిల్లీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అందోళనకారులు కలవరపడుతున్నారు.

నిరసనకారుల వున్న ప్రాంతానికి తుపాకులు పట్టుకుని సీఏఏకు మద్దతు పలుకుతున్న యువత వస్తున్నారని.. అయితే వారికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయని వారు ప్రశ్నించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. వారికి మరణాయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయాన్ని కనుగోనలేకపోయారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికోందరు నిరసనకారులు మాత్రం ఏకంగా ఈ ఘటన వెనుక ఢిల్లీ పోలీసులే వున్నారని అరోపిస్తున్నారు. వారే యువతను రెచ్చగొట్టి మరీ  కాల్పులు  జరిపిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు షాహీన్ బాగ్ ప్రాంతంలో నిరసన ప్రదర్శన కొందరు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో కపిల్ గుజ్జర్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు గుజ్జార్ ను అదుపులోకి తీసుకున్నారు. కపిల్ గుజ్జార్ ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు  జై శ్రీరాం అంటూ నినాదాలు చేశాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన గుజ్జార్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు.  గత 20 రోజులుగా షాహీన్ బాగ్ లో ప్రతి రోజు నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి.    కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఈ కాల్పుల ఘటన జరగటం కొంత కలవరం సృష్టించింది.  కాల్పుల ఘటనల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KAPIL GUJJAR  CAA  shaheen bagh shooting  anti-caa protest  violence  delhi police  protesters  Politics  

Other Articles