Brahmam Gari Kalagnanam predicts Coromki decades before వీరబ్రహ్మంద్రస్వామి కాలజ్ఞానం నిజమైందన్న వార్త వైరల్..

Prominent hindu saint pothuluri veerabhramendra swamy predicted corona virus decades before

coronavirus, social meida, remidies, HIndu saint, Pothuluri Veera Brahmendra Swamy, future saying, Kalagnanam, Rajiv Gandhi International airport, national centre for disease control, coronavirus in hyderabad, Coronavirus alert in Hyderabad, Coronavirus alert, coronavirus patients, central doctors team coronavirus, Hyderabad, Telangana

Few statements of prominent saint Pothuluri Veerabhramendra Swamy on China's Coronavirus doing rounds on social media and creating a buzz. It is mentioned in the statements that a virus name Coramki will outburst in the northeast side of India and it claims the lives crores of people.

కరోనా కలకలం.. వీరబ్రహ్మంద్రస్వామి కాలజ్ఞానం నిజమైందన్న వార్త వైరల్..

Posted: 01/29/2020 12:45 PM IST
Prominent hindu saint pothuluri veerabhramendra swamy predicted corona virus decades before

ప్రమాదకరమైన కరోనా వైరస్‌ వందల మంది ప్రాణాలను ఇప్పటికే హరించేసిందని, ఇంకా వేల మంది దీని బారిన పడ్డారన్న వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇది వైరస్ కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అల్లం అధికంగా తీసుకోవాలని, అల్లం, మిరియాల పోడి, తులసి ఆకులు, కొంచెం బెల్లం కలుపుకుని కాషాయంగా చేసుకుని రెండుపూటలా సేవిస్తే కరోనా వైరస్ సోకదని నాడి చికిత్స వైద్యులు ఇప్పటికే సమాచారం అందించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక హోమియోపతి వైద్యులు కూడా అల్లం కాషాయం మేలుచేస్తుందని సూచిస్తున్నారు.

అయితే కరోనా వైరస్ శరవేగంగా సోకడంతో పాటు ఈ వ్యాధిగ్రస్తులు అకస్మాత్తుగా తూలుతూ కిందపడి ప్రాణాలను విడచిపెట్టడం కూడా ప్రజల్లో అందోళన రెకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా గత రెండు రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తును మన కళ్లముందు పరిచిన పరంజ్యోతి, మహాగురువులు, మహర్షి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పారన్న వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

పోతులూరి వీరబ్రహ్మంద్రేస్వామి తన కాలజ్ఞానంలో కరోనా వైరస్ గురించి చెప్పారన్నదే ఆ పోస్టు సారాంశం. అయితే బ్రహ్మంగారికి ముందే ఈ వ్యాధి గురించి తెలుసా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నా.. అంతకన్నా.. ఈ వ్యాధి విషయంలో అయేన చేప్పిన మరణాల సంఖ్య ఇప్పుడు కలవంపెడుతోంది. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో చెప్పారంటూ ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఇమేజ్ లో ఏముందంటే...?

"ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ.. కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి.. కోడిలాగ తూగి సచ్చేరయా" అని చెప్పారు. ప్రస్తుత పరిణామాలకు, బ్రహ్మంగారు చెప్పినదానికి పోలిక ఉందనే చాలా మంది అంటున్నారు. భారతదేశానికి చైనా ఈశాన్య దిక్కునే ఉంది. కోరంకి అనే జబ్బు కరోనా వైరస్ పేర్లు రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. అందుకే బ్రహ్మంగారు చెప్పింది జరగబోతోందనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే పెనుముప్పు తప్పదని నెట్ జనులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles