MP Komatireddy Venkat reddy fires on CM KCR ‘‘కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లే రోజు వస్తుంది’’

Mp komatireddy venkat reddy sensational comments on cm kcr

MP Komatireddy Venkat reddy, TRS, telangana municipal election results, CM KCR, KTR, Nalgonda, Choutuppal, Choutuppal Municipality, mla komatireddy rajagopal reddy, Congress, TRS, kusukuntla prabhakar reddy, CPM, CPM party Office, Election commission, Telangana Congress, TRS Government, Telangana, Politics

congress leader, bhuvanagiri mp komatireddy venkat reddy slams cm kcr for misusing the power in municipal chairman elections, and pledged to send them to jail in near future

కేసీఆర్, కేటీఆర్ లపై విరుచుకుపడ్డ ఎంపీ కోమటిరెడ్డి

Posted: 01/28/2020 07:05 PM IST
Mp komatireddy venkat reddy sensational comments on cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో దోచుకున్న డబ్బుతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిజాయతీగా జరగలేదని విమర్శించారు. గాంధీ భవన్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు ముందే అందరు మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.

తన జీవితంలో ఇలాంటి మున్సిపల్ ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఎంపీ విమర్శించారు. ఎక్స్ అఫీషియో ఓట్లతోనే యాదగిరి గుట్ట పురపాలికను కైవసం చేసుకున్నారని, ఆదిభట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకెళ్లి టీఆర్ఎస్ ఛైర్మన్ గా చేశారని మండిపడ్డారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబెల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని తొలుత తొడగొట్టిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు మళ్లీ వారి గడ్డాలను దువ్వి మరీ వారిని పార్టీలోకి చేర్చుకున్నారని, ఓట్లు వేయవద్దని చెప్పిన నోటితోనే వారిని అహ్వానించారని.. ఇంత నీతి తప్పిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌ది నోరా.. తాటిమట్టా? అని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో నారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఛైర్మన్ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఇక హైదరాబాద్ నగర శివారు అయిన పెద్ద అంబర్ పేట, చౌటుప్పల్ లో కాంగ్రెస్ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాగేసుకున్నారని, చౌటుప్పల్ లో సీపీఎం అభ్యర్థులను కొనేశారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజాకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పరాకాష్టగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయని ధ్వజమెత్తారు.

కేసీఆర్, కేటీఆర్ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరిగి ఎండగడతామని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. వారు సిగ్గు లేకుండా పని చేస్తున్నారని, నల్గొండలో టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. వాళ్లు చేసిన అవినీతిపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్‌ వంటి దర్యాప్తు సంస్థలకు తానే అందిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్ లను వదిలిపెట్టబోడని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles