I am Not Worried About EC Notice: Kapil Mishra ‘ఆప్’ను ‘పాక్’తొ పోల్చి మరీ సమర్థించుకున్న బీజేపి నేత

Showcause notice to bjp s kapil mishra for india vs pak remark

aap, Amit Shah, arvind kejriwal, BJP, congress, delhi assembly elections 2020, Kapil Mishra, Shaheen Bagh, New Delhi, Politics

The Election Commission has sought a report from the Delhi Chief Electoral Officer (CEO) on a tweet posted by Bharatiya Janata Party candidate Kapil Mishra who had termed the anti-CAA protest sites in the national capital "mini-Pakistan" and said the upcoming assembly elections will be a contest "on Delhi roads between India and Pakistan".

‘ఆప్’ను ‘పాక్’తొ పోల్చి మరీ సమర్థించుకున్న బీజేపి నేత

Posted: 01/24/2020 12:26 PM IST
Showcause notice to bjp s kapil mishra for india vs pak remark

వచ్చే నెల 8న జరగనున్న దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశరాజధానిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపి నేత కపిల్ మిశ్రాకు ఎన్నికల సంఘం నోటీసును జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను నిజం మాట్లాడానని చెప్పకోచ్చిన ఆయన.. ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసినంత మాత్రన.. దాని గురించి కలత చెందాల్సిన అవరసమేముందీ అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ తాను కట్టబడి వున్నానని అన్నారు.

దీంతో దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్ మధ్య పోరాటం'తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన మరోమారు సమర్థించుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని భారత ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. 'ఎన్నికల కమిషన్ నుంచి గురువారం రాత్రి నాకు నోటీసు అందింది. ఇవాళ నా సమాధానం ఇస్తాను. నేను తప్పుమాట్లాడినట్టు అనుకోవడం లేదు. నిజం చెప్పడం ఈ దేశంలో నేరమేమీ కాదు. నేను నిజమే చెప్పా. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా' అని కపిల్ మిశ్రా తెలిపారు.
 
ఈనెల 23న కపిల్ మిశ్రా ఓ ట్వీట్ చేస్తూ 'ఫిబ్రవరి 8న ఢిల్లీ వీధుల్లో భారత్, పాక్ మధ్య పోరాటం జరగనుంది' అని పేర్కొన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పాక్ అనుకూల సమూహాలు మోహరించాయని, పాక్ ఇప్పటికే ఇందెర్ లోక్, ఛాంద్ బాగ్ లోకి చొచ్చుకొచ్చిందని గురువారం ఉదయం మీడియా ముందు కూడా వ్యాఖ్యానించారు. దీంతో కపిల్ మిశ్రా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ తక్షణ నివేదికకు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. దీనికి ముందు, మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కపిల్ మిశ్రా తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరిచారని 'ఆప్' నాయకులు ఆరోపించారు. మిశ్రా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles