Polling for local bodies in Telangana underway తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న ‘పుర’ పోరు

Polling underway for local body elections in telangana

telangana civic body elections, telangana urban local body polls, telangana local body elections, telangana municipal corporation elections, telangana muncipality elections, muncipal polls 2020, Telangana, Politics

Polling is underway in the municipal elections in Telangana amid elaborate security arrangements, officials said. The polling began at 7 a.m. in 120 municipalities and nine municipal corporations across the state and it will continue till 5 p.m.

తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న ‘పుర’ పోరు

Posted: 01/22/2020 11:14 AM IST
Polling underway for local body elections in telangana

తెలంగాణలోని 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు కూడా తమ సత్తాను చాటుకునేందుకు సిద్దంగా వున్నాయి. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం 50 వేల మంది పోలీసులతో పటిష్టమైన పహారా ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాల్లో బందోబస్తపై ప్రత్యేక దృష్టి సారించారు.

పురపాలక సంఘాలకు సంబంధించి 2,647 వార్డుల్లో 11,179 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నగర పాలక సంస్థల్లోని 322 డివిజన్లలో 1,747 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో 6188 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా, కార్పోరేషన్లలో 1773 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘాలతో పాటు కార్పోరేషన్ల పరిధిలో మొత్తంగా 50 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

కాగా పోలింగ్ నేపథ్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రతేక దృష్టి సారించి 2,406 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. 2,406 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక మరో 2072 కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ తీస్తున్నారు. 1240 కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ కోనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఉదయం నుంచే పోలింగ్ జోరందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles