Amaravati capital protest: Farmers agitation on Day 32 32వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్ష

Amaravati parirakshana samiti delegation takes capital issue to governor s notice

Amaravati, Amaravati farmers, mandadam, Tulluru, tents, agitations, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

A delegation of the Amaravati Parirakshana Samiti (APS) met Governor Biswa Bhusan Harichandan, and urged him to use his good offices in stopping the government from going ahead with its proposal to shift the capital city to Visakhapatnam.

అమరావతిలో 32వ రోజు కోనసాగుతున్న రైతుల దీక్ష

Posted: 01/18/2020 12:30 PM IST
Amaravati parirakshana samiti delegation takes capital issue to governor s notice

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో స్థానికులు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి ప్రాంత గ్రామస్థులు ఉద్యమిస్తున్నారు. మందడం, తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల రైతులు, మహిళలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తమ మొర ఆలకించాలని ముఖ్యమంత్రి జగన్‌ ను కోరారు. ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నిరసన కార్య్రకమాల్లో పాల్గోన్న యువత జై అమరావతి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదించారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తమ ఉద్యమం, నిరసన కార్యక్రమాలు ఆగవని ఆయన తెలిపారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఎక్కడ చూసినా ఇదే చిత్రం కనిపిస్తోంది. దీనికి తోడు  పండుగులకు ఇంటికొచ్చిన బంధువులు కూడా తోడుకావడంతో వారు కూడా టెంట్లలోకి వెళ్లి తమవారికి మద్దతును ప్రకటిస్తూ.. అమరావతే రాజధాని కావాలన్న అకాంక్షను వెల్లడిస్తున్నారు. టెంట్లలో కూర్చోని నిరసన తెలియజేస్తున్న అందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. 32 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. తమను ప్రభుత్వం కానీ.. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నించారు. ఎవరు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారని ఆందోళనకారులు నిలదీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles