Jr NTR, Kalyan Ram pays tribute to Sr NTR ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తారక్, కల్యాణ్ రామ్

Jr ntr kalyan ram pays tribute to former cm nt ramarao

Nandamuri Taraka RamaRao, TDP founder President, Johar NTR, young tiger, Jr NTR, Nandamuri Kalyan Ram, tributes legendary actor, tributes to NTR, Tributes to politician NT Rama Rao, NTR 24th death anniversary, Telangana, Hyderabad, Mangalagiri, Andhra pradesh, Politics

Amidst the slogans of Johar NTR, young tiger Jr NTR along with his brother Nandamuri Kalyan Ram paid tributes to the legendary actor, politician Nandamuri Taraka Rama Rao popular as NTR on his death anniversary.

ITEMVIDEOS: ఎన్టీఆర్ 24వ వర్ధంతి: నివాళులు అర్పించిన తారక్, కల్యాణ్ రామ్

Posted: 01/18/2020 10:53 AM IST
Jr ntr kalyan ram pays tribute to former cm nt ramarao

ఆంధ్రుల ఆరాధ్యుడు, సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘననివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్ లోని సమాధి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు ఆయనకు నివాళులు సమర్పించారు. వేకువజామునే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న తారక్, కళ్యాణ్ రామ్ లను నేరుగా తమ తాతయ్య సమాధి వద్దకు వెళ్లి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇక ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు వస్తున్నారన్న సమాచారం వున్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంతకుముందే నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తనయ, మాజీ కేంద్ర మంత్రి బీజేపి నేత ఫురందేశ్వరి, నందమూరి సహాసిని, రామకృష్ణ తదితరలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో ముందుచూపుతో ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించిన మహానేత అని కోనియాడారు. బావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాలనే సుదూరలక్ష్యమున్న విజనరీ కలిగిన నాయకుడని అన్నారాయన. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తారక రాముడి విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజానికి మేలు చేసేలా ముందుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు చంద్రబాబు పిలుపిచ్చారు.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన స్వర్గీయ నేత ఎన్టీఆర్‌ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ ఎన్టీఆర్‌ ఘాట్లో స్వయంగా ఏర్పాట్లు చేసింది. సమాధి పెచ్చులూడుతుండటంతో పాటు పుష్పాలంకరణపై హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో సమాధి అలంకరణ పనులు పార్టీ పరంగా చేపట్టాలని టీటీడీపీ నిర్ణయించి.. మరమ్మతులతో పాటు పుష్పాలంకరణ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles