Mumbai-Ahmedabad Tejas Express flagged off పట్టాలెక్కిన రెండో తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు

Ahmedabad mumbai tejas express irctc s second train flagged off

mumbai to ahmedabad tejas express fare tejas express train tejas express ticket tejas express price tejas express timing irctc tejas express tejas express route tejas express train fare tejas express stops new tejas express 82901 tejas express tejas express ticket rate tejas express owner name ticket price of tejas express mumbai ahmedabad tejas tejas express owner tejas express ahmedabad to mumbai tejas express ahmedabad to mumbai fare price

The Ahmedabad-Mumbai Tejas Express, the second train to be run by railway subsidiary IRCTC, has been flagged off by Gujarat Chief Minister Vijay Rupani from Ahmedabad.

ముంబై-అహ్మదాబాద్ మధ్య పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు

Posted: 01/17/2020 04:38 PM IST
Ahmedabad mumbai tejas express irctc s second train flagged off

భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇవాళ రెండో మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ప్రధాన మంత్రి సొంత నియోజకవర్గం వారణాసి నుంచి ఢిల్లీకి పయనమయ్యే తొలి ప్రైవేటు రైలు ఇక తన మార్గాలను విస్తరించుకుంది. ఢిల్లీ నుంచి వారణాసీ తరువాత తాజాగా అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో తేజస్‌ రైలును పరుగులు పెట్టనుంది. ఐఆర్సీటీసీకి చెందిన రెండో ప్రైవేటు రైలు మార్గాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఇవాళ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.

వారంలో గురువారం మినహా అన్ని రోజుల పాటు ఈ రైలు ఈ మార్గంలో సేవలు అందించనుంది. గుజరాత్‌ నుంచి కేవలం ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది. ఇవాళ లాంఛనంగా ప్రారంభమైనా ఈ నెల 19 నుంచి ఈ రైలు వాణిజ్యపరంగా సేవలను అందించనుంది. తేజస్‌ రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ హాజరుకావాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రాలేకపోయారు. ఈ విషయాన్ని బీజేపి ఎంపీ కిరిట్ సోలంకీ మీడియాకు తెలిపారు. దీంతో గుజరాత్ సీఎం దీనిని ప్రారంభించారన్నారు.

తేజస్ రైలు ఆగమనంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు లబ్దిపోందుతాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అశాభావం వ్యక్తం చేశారు. తేజస్ రైలు తమ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పుకోచ్చారు. ఇదే మార్గంలో బుల్లెట్‌ రైలు కోసం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇక బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాలు అభివృద్దలో మిగతా రాష్ట్రాలతో పోటీపడుతూ దూసుకుపోవడం ఖాయంగా చెప్పుకోచ్చారు.  అధునాతన సౌకర్యాలు, హంగులతో తేజస్ రైలును తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్ల ఆధ్వర్యంలో నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles