Incredible Footage Shows Water Flowing Upwards మహాద్భుతం: సముద్రంపై ఏర్పడిన టొర్నాడో

Incredible footage shows water flowing upwards

Faroe Islands, Faroe Islands incredible video, water flowing upwards, defy gravity, Samy Jacobsen, Faroe Islands spectacular video, water spout, tornado on water, denmark, ireland, norway, spectacular news, viral video

An incredible video, captured in Faroe Islands, shows a column of water flowing upwards to defy gravity. Samy Jacobsen, 41, was walking along the cliffs off Suouroy in the Faroe Islands when he came across the extraordinary sight,

ITEMVIDEOS: మహాద్భుతం: సముద్రం నుంచి కొండపైకి నీరు..

Posted: 01/10/2020 05:03 PM IST
Incredible footage shows water flowing upwards

అదో ఫేరోయి ద్వీపం.. డెన్మార్క్ దేశానికి హృదయంలా వున్న ఈ ప్రాంతంలో సముద్రం కూడా వుంది. అయితే ఇక్కడి సముద్రంలోని నీరు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహించింది. సుడిగాలి మాదిరిగా ఆకాశంలోకి నీరు చిమ్ముతోంది. కొండ శిఖరంపై వరకు ఒకే దారతో నీరు చిమ్ముతోంది. ఈ అరుదైన అద్భుతమైన దృశ్యం ఫెరోయి ద్వీపంలోని స్యూరోయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన శామీ జాకబ్సెన్ (41) అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు.

కొండ ప్రాంతాల గుండా ఈ ప్రాంతానికి చేరుకుని ఆ మహాద్భుత దృశ్యాలను తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. ఆ వీడియోలో కొండ అంచున సముద్రంలోని అలల తాకిడికి సుడిగుండం మాదిరిగా ఏర్పడింది. దీని ప్రభావంతో అల నుంచి నీళ్లు గాల్లోకి చిమ్ముతూ కొండ శిఖరం కొనపై పడుతున్నాయి. దీనిపై వాతావరణ నిపుణులు నీళ్లతో కూడిన సుడిగుండంగా విశ్వసిస్తున్నారు. ఒక పిల్లర్ మాదిరిగా గాల్లోకి నీళ్లు విరజిమ్ముతోందని అంటున్నారు.

నీళ్లలో ఏర్పడిన సుడిగుండం ప్రభావంతోనే గాలి కింది నుంచి రౌండుగా తిరుగుతూ పైకి వస్తోందని చెబుతున్నారు. ఆ గాలి పీడనంతో పాటు నీళ్లు కూడా అలానే పైకి ఎగసిపడుతున్నాయన్నారు. అక్కడి ప్రాంతమంతా భారీ జల్లులతో వాతావరణమంతా ఒక మాదిరిగా మారిపోవడంతోనే ఇలా సముద్రంలోని నీరు గాల్లోకి ఎగిసిపడుతున్నట్టు తెలిపారు. సాధారణంగా నీళ్లు పెద్దఎత్తున గాల్లోకి చిమ్మాలంటే దానికి కింది నుంచి అధిక స్థాయిలో పీడనం కావాలి. అప్పుడే నీరు గాల్లోకి చిమ్మడం జరుగుతుంది.

మహాద్భుతం అని ఈ విచిత్రాన్ని కొనియాడుతున్న తరుణంలో గత ఏడాది సెప్టెంబర్ 22న ఒడిశాలో కూడా ఇలాంటి విచిత్రానికి నెలవయ్యింది. రాష్ట్రంలోని చిల్కా సరస్సు దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరు పొందింది. వివిధ పక్షి జాతులతో జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రసిద్ధి పొందింది. ఈ లేక్‌ను చూడడానికి ఏటా వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు టోర్నోడో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అదెలా అంటే నీరు ఆకాశం నుంచి భూమ్మీదకు పడుతుంది కానీ. అకస్మాత్తుగా ఏర్పడిన టోర్నడో సరస్సులో నుంచి నీరు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్లడాన్ని యాత్రికులు ఆసక్తిగా తిలకించి సరికొత్త అనుభూతిని పొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles