amaravati farmers maha dharna blocked by police అమరావతిలో అప్రకటిత కర్ప్యూ.. మహాధర్నాను అడ్డుకున్న పోలీసులు

Farmers maha dharna demanding govt not to shift capital blocked by police

YS Jagan, Amaravati, mallikharjuna rao, Tulluru, dondapadu farmer, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Even as the farmers of Amaravati have been strongly resisting the shift of administrative capital of Andhra Pradesh to Visakhapatnam, on 21st day of protest continous in the form of maha dharna was blocked by police forces. Amaravati capital area seems to be undeclared curfew.

అమరావతిలో అప్రకటిత కర్ప్యూ.. మహాధర్నాను అడ్డుకున్న పోలీసులు

Posted: 01/07/2020 11:02 AM IST
Farmers maha dharna demanding govt not to shift capital blocked by police

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో ఆయా ప్రాంతాల రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్లితో 21వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 20 తరువాత విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న క్రమంలో అమరావతి రైతులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇవాళ అమరావతిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న రైతులు మందడంలో మహాధార్న ను చేపట్టి.. రోడ్డుపై బైఠాయించాలని కూడా భావించారు.

అయితే రైతులు వ్యూహాన్ని ముందే పసిగట్టిన పోలీసులు రైతులు రోడ్డుపైకి రాకుండా అనేక ఆంక్షలు విధించారు. ఒక విధంగా చెప్పాలంటూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ప్యూ వాతవరణం అలుముకుంది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. గ్రామస్థులను రోడ్డపైకి రాకుండా చేయడంలో సఫలీకృతమైన పోలీసులు మరోరకంగా వారిని ఇళ్లకు మాత్రమే పరిమితం చేయగలిగారు. గ్రామాస్థులు ప్రధాన రోడ్లపైకి రాకుండా అడ్డుగా కంచె వేశారు. రహదారి సమీపంలో వున్న దుకాణాలను మూసివేయించారు.

ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్వచ్ఛందంగా బంద్ పాటించినప్పుడు తమ దుకాణాలను బలవంతంగా తెరిపించిన పోలీసులు.. ముఖ్యమంత్రి వస్తున్నారని దుకాణాలను మూసివేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సచివాలయానికి వచ్చిన ప్రతిసారి దుకాణాలు మూసివేయాలా.? ప్రభుత్వం తమను తమ వ్యాపారాలు కూడా చేసుకోనివ్వదా.? అసలు ప్రభుత్వం వున్నది తమ కోసమా.? లేక తాము ప్రభుత్వం కోసం వున్నామా అంటూ ప్రశ్నించారు. ఇక గ్రామాల నుంచి రైతులు ఎవరూ బయటకు రాకుండా రైతులు కూడా సహకరించాలని కోరిన పోలీసులు.. సహకారం అంటే కంచెలు వేయడమేనా అంటూ నిలదీశారు.

బంద్ పాటించినప్పుడు అత్యవసర దుకాణాలను తెరచిన తమకు గ్రామస్థులు సహకరించారని, అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా కనీసం మందుల దుకాణాలు, అసుపత్రులను కూడా పోలీసులు తెరవనీయడం లేదని వారు అరోపించారు. తమ గ్రామాల చుట్టూ కంచెలు వేయించిన తరువాత ముఖ్యమంత్రి సచివాలయానికి రాగలుగుతున్నారని, ఇంత భయం ఆయనకెందుకని రైతులు నిలదీస్తున్నారు. మరోవైపు సీపీఎం పార్టీ కార్యాలయంలో సమావేశమైన 20 మంది మందడం రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వ్యాను కింద పడుకుని నిరసనకారులు తమ అందోళనను వ్యక్తం చేశారు. బలవంతంగా రైతులను లాగేసి వారిని గుంటూరు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles