Unprecedented rush for Vaikunta Ekadasi festival ముక్కోటీ ఏకాదశిని పురస్కరించుకుని కిటకిటలాడుతున్న ఆలయాలు

Devotees turns up at vaishnava temples and tirumala on vaikunta ekadasi

vaikuntha ekadasi, mukkoti Ekadasi, Yadagiri gutta, tirumala temple, balaji temple, lord venkateswara temple, Chilkur Temple, Vaishnava alayas, Vishnu Temples, Andhra pradesh, Telangana

The sacred shrine of Lord Venkateswara witnessed unprecedented crowds on the eve of Vaikunta Ekadasi festival. While the second ghat road leading to the shrine witnessed heavy traffic throughout the day, both trekking routes witnessed a continuous flow of pilgrims beginning from the early hours.

ముక్కోటీ ఏకాదశిని పురస్కరించుకుని కిటకిటలాడుతున్న ఆలయాలు

Posted: 01/06/2020 10:40 AM IST
Devotees turns up at vaishnava temples and tirumala on vaikunta ekadasi

ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భగవన్నామ స్మరణతో మార్మోగుతున్నాయి.  తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజల్లో మునిగి తేలుతున్నారు. మరీముఖ్యంగా వైష్ణావాలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ పర్వదినం రోజున వేకువ జామునుంచే స్వామివారిని ఉత్తర ద్వారా నుంచి ప్రవేశించి భక్తులు దర్శించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశుని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబంతో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్, ఏపీ మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు దర్శించుకున్నారు.

ఇక తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. తెలంగాణలోని భద్రాద్రి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ దంపతులు, సత్యవతి రాథోడ్‌లు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తజన సందోహంతో నారాయాణ మంత్రంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మార్మోగిపోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles