Bank strike against anti-labour policies of Govt on Jan 8 8న బ్యాంకుల బంద్.. సమ్మెలో సిబ్బంది.!

Six bank unions to strike work on jan 8 in support of central tus

bank unions strike, bank strike on jan 8, stock exchanges, State Bank of India, central trade unions strike, AIBOA, INBOC, IBA

Six bank unions will go on strike on January 8 to show their support for the central trade unions’ strike call on the same day. In a notification to the stock exchanges, State Bank of India (SBI) said that it has been informed about the strike by the Indian Banks’ Association (IBA).

8న బ్యాంకుల బంద్.. సమ్మెలో సిబ్బంది.!

Posted: 01/04/2020 07:27 PM IST
Six bank unions to strike work on jan 8 in support of central tus

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్యాంకు యూనియన్లు మళ్లీ సమ్మెకు సై అంటున్నాయి. ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిస్తున్నాయి. ఈ పిలుపుకు అల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్మిక సంఘాలు కూడా మద్దుతు పలుకుతున్నాయి. ఫలితంగా ఈ నెల 8న బ్యాంకుల్లో వ్యవహరాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు వున్నాయి.

బ్యాంకుల సమ్మె ఫలితంగా బ్యాంకుల ఎదుటే సిబ్బంది నిరసన ప్రధర్శనలు చేపట్టే అవకాశాలు వుండటంటో.. బ్యాంకు శాఖలకు మూసివేసే అవకాశాలు వున్నాయి. ఇక  సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో అటు ఎటిఎం సేవలు కూడా అందుబాటులో వుండకపోవచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, బ్యాంకింగ్ సిబ్బంది సమ్మె ప్రభావం నెట్ బ్యాంకింగ్ సేవలు NEFT, IMPS ఇంకా RTGS బదిలీలు ఎలాంటి  ప్రభావం ఉండదు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు 8వ తేదీన డిమాండ్ ఎక్కువగా వుండే అవకాశముంది.

సమ్మె రోజున ఎటువంటి కీలను డిమాండ్ చేయవద్దని, అంగీకరించవద్దని, క్లరికల్ విధులను నిర్వర్తించవద్దని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి) ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా సభ్యులను కోరారు. జీతం పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు, బ్యాంకింగ్ సంస్కరణలు, బ్యాంకు విలీనాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు వేతనలపై చట్టబద్ధమైన డిమాండ్ అనవసరంగా ఆలస్యం చేస్తోంది. 5 రోజుల బ్యాంకింగ్ పని దినాల డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తోందని అరోపిస్తున్నారు.

ఉద్యోగులు, అధికారులు బ్యాంకులలో అధిక పనిభారంతో బాధపడుతున్నారని వారి సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని అరోపిస్తున్నారు. అలాగే బ్యాంకులలో కూడా తగిన నియామకాలు జరగడం లేదని వివిధ బ్యాంకు సంఘాలు సంతకం చేసిన సమ్మె నోటీసులో వివరించారు. బ్యాంక్ సమ్మె పిలుపుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF) మరియు ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC) కూడా మద్దతు ఇస్తున్నాయి. సో ఫ్రెండ్స్ బ్యాంకుల్లో ఈ నెల 8న పనులుంటే ముందుగానే పూర్తి చేసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles