Capital should be in Amaravati, says Pawan రాజధాని పోరాటానికి మద్దతు: పవన్ కల్యాణ్

Andhra capital should be in amaravati we stand by farmers pawan kalyan

Janasena, Pawan Kalyan, Mangalagiri, Amaravati, shifting of capital, 29 Villages, Three Capitals, YSRCP Government, vishakapatnam, Rayalaseema, division between regions, HighCourt, Kurnool, andhra pradesh, politics

Jana Sena Party chief Pawan Kalyan today visited Amaravati villages where the villagers are protesting against the three capitals desicion of Andhra Pradesh Government, opposed the proposal of decentralising the capital and said it must remain in Amaravati. Janasenani also assured that his party will stand by farmers side.

జగన్ ధర్మం తప్పారు.. పోరాటానికి మద్దతు: పవన్ కల్యాణ్

Posted: 12/31/2019 01:51 PM IST
Andhra capital should be in amaravati we stand by farmers pawan kalyan

రాజధాని అమరావతిలో ఏర్పాటుకు ప్రతిపక్ష నేతగా సుముఖత వ్యక్తం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో అవకతవకలంటూ రాజధాని మార్పు అంటూ ప్రకటనలు చేయడం సముచితం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అభివృద్ది వీకేంద్రీకరణ పేరుతో పరిపాలన వికేంద్రీకరణకు పాల్పడి రాష్ట్రానికి మూడు రాజధానులు సంకేతాలు ఇచ్చి.. రాష్ట్ర ప్రజల్లో రాజధానిపై సంధిగ్ధత ఏర్పడేలా చేశారని విమర్శించారు. ఇప్పటికైనా రాజధానిపై జగన్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనను వెల్లడించారని ఆయన డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న ఆందోళనలపై స్పందించిన ఆయన ఇవాళ అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్రబాలెంలో ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని ప్రజల మధ్య పాంత్రీయ అసమానతలు, వైషమ్యాలు పెంచే చర్యలకు ప్రభుత్వమే పాల్పడటం ఇక్కడే జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా అంగీకరించిన జగన్.. ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదని.. ఆయన మాటలను విశ్వసించి రాష్ట్ర ప్రజలను ఆయనకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతును ఇచ్చారని, అయినా ఆయన మాట తప్పారని.. మాట తప్పిన మనిషి ధర్మం తప్పినట్లేనని.. ధర్మం తప్పిన వారిని ఈ నేల క్షమించదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు భూములు ఇచ్చారని... అలాంటి రైతులను ఏకంగా ప్రభుత్వమే మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వమే మోసం చేయడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పుతారనే ఉద్దేశంతోనే వైసీపీకి ప్రజలు సంపూర్ణ మద్దతును కట్టబెట్టారని... చివరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీకి మంచి మెజార్టీ ఇచ్చారని... ఇప్పుడు తాను నిలబడి, మాట్లాడుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే కూడా వైసీపీ నాయకురాలే ప్రజాప్రతినిధులని చెప్పారు. అయినా, వీరంతా ఇక్కడి రైతులకు అండగా లేకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.

తాను ముందునుంచి ఇక్కడి రైతుల గురించి అలోచిస్తున్నానని.. ఇప్పటికే గత ప్రభుత్వానికి పలుమార్లు వేల ఎకరాల భూ సేకరణ చేసి అభివృద్ది చేయడం కష్టమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతికి 3 వేల ఎకరాలు చాలని తొలుత తాను అనుకున్నానని... రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు తనకు భయమేసిందని పవన్ చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు భూములు ఇవ్వలేదని... అద్భుతమైన రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు.

ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుందని, ఈ క్రమంలో తాను ఆందోళన చెందినట్టే అమరావతి పరిస్థితులు మారుతుండటం ఇక్కడి రైతులను కలవరపరుస్తుందని అన్నారు. అటు పూర్తిస్థాయిలో అభివృద్ది జరగకపోవడం.. తాజాగా మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం కూడా ఇక్కడి రైతులను ఎంతో మానసక ఆందోళనకు గురిచేస్తోందని పేర్కోన్నారు. అయితే రైతులు ఎవరు వచ్చి ఎలాంటి హామీలు ఇచ్చినా పోరాటాన్ని మాత్రం అపవద్దని, రైతులకు తామ పార్టీ న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ హామి ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles